Last Updated:
Life Insurance: భర్త చనిపోవడంతో రూ.50 లక్షల బీమా డబ్బులు వస్తాయని ఆశించిన ఆ మహిళకు కంపెనీ షాకిచ్చింది. క్లెయిమ్‌ను తిరస్కరించి కేవలం రూ.18,713 మాత్రమే తిరిగి ఇచ్చింది. కానీ ఆమె వెనక్కి తగ్గకుండా కన్స్యూమర్ ఫోరాన్ని ఆశ్రయించడంతో సీన్ మొత్తం మారిపోయింది. చివరికి రూ.50 లక్షలు, 9% వడ్డీతో పాటు పరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశించింది.
సాధారణంగా ఎవరైనా జీవిత బీమా (Life Insurance) తీసుకునేది తమ కష్టకాలంలో లేదా తమ తదనంతరం కుటుంబానికి ఆర్థిక భద్రత ఉంటుందనే ఉద్దేశ్యంతోనే. అయితే, బీమా సంస్థలు చిన్నచిన్న కారణాలను సాకుగా చూపి క్లెయిమ్‌లను తిరస్కరించడం తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి దారుణమైన చర్యకు పాల్పడిన ఒక ప్రముఖ జీవిత బీమా సంస్థకు నాగ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (కన్స్యూమర్ ఫోరం) గట్టి షాక్ ఇచ్చింది. బాధితురాలైన ఒక వితంతువుకు ఏకంగా రూ. 50 లక్షలకు పైగా బీమా మొత్తాన్ని చెల్లించాలని తీర్పునిచ్చింది.

