Last Updated:
Anna Hazare: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 87 సంవత్సరాల వయసున్న అన్నా హజారే ఆరోగ్యం క్షీణించడంతో హుటాహుటిన సోమవారం బాంబే ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేరారు. వైద్యులు ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.
Anna Hazare: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 87 సంవత్సరాల వయసున్న అన్నా హజారే ఆరోగ్యం క్షీణించడంతో హుటాహుటిన సోమవారం బాంబే ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేరారు. వైద్యులు ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. గత కొద్దిరోజులుగా అన్నా హజారే తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్, డీహైడ్రేషన్ , కిడ్నీ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడుతూ స్వగ్రామంలోనే చికిత్స పొందుతున్నారు. అయితే వయోభారం కారణంగా శరీరంలోని అవయవాల పనితీరు మరింత క్షీణించడంతో ముంబైకి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది.

