Last Updated:
Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.
రెండు రోజుల విరామం తర్వాత సోమవారం మార్కెట్లు తిరిగి ప్రారంభం కావడంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని పరిణామాలు, పెట్టుబడిదారుల ట్రేడింగ్ ధోరణులు, డాలర్ కదలికలు వంటి అంశాల ప్రభావం కమోడిటీ మార్కెట్‌పై కనిపించింది. దీంతో మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే విలువైన లోహాల ధరల్లో గణనీయమైన క్షీణత నమోదైంది.

