Last Updated:
Urvashi Rautela: పురుషుల ఫ్యాషన్, ఇంటీమేట్వేర్ రంగంలో కొత్త ట్రెండ్‌కు తెరలేచింది. ఇప్పటివరకు సౌకర్యం, రోజువారీ వినియోగానికే ఎక్కువగా పరిమితమైన పురుషుల లోదుస్తుల మార్కెట్‌ను లగ్జరీ, స్టైల్, ఆత్మవిశ్వాసం, సాన్నిహిత్యంతో కొత్త కోణంలో ఆవిష్కరించేందుకు ‘UNDRESS’ బ్రాండ్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది.
భారతీయ ఫ్యాషన్ ప్రపంచంలో ఒక సరికొత్త విప్లవానికి తెరలేచింది. పురుషుల ఇంటీమేట్వేర్ రంగాన్ని పూర్తిగా కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ ‘అన్‌డ్రెస్’ (UNDRESS) అనే లగ్జరీ బ్రాండ్ దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభమైంది. భారతీయ ఆలోచనలు, పారిసియన్ డిజైన్ సంస్కృతి, ఇండోనేషియా తయారీ నైపుణ్యం కలబోతగా రూపుదిద్దుకున్న ఈ వినూత్న బ్రాండ్‌కు ప్రముఖ బాలీవుడ్ నటి, ఫ్యాషన్ ఐకాన్ ఊర్వశి రౌతేలా ఫ్రంట్మ్యాన్గా (బ్రాండ్ అంబాసిడర్‌గా) వ్యవహరిస్తున్నారు. తొలి విడతగా ₹799 నుండి ₹1,399 ధరల శ్రేణిలో పదమూడు భిన్నమైన శైలులతో (స్టైల్స్) కూడిన కలెక్షన్‌ను ఈ బ్రాండ్ మార్కెట్లోకి విడుదల చేసింది.

