Last Updated:
బ్యాంక్ ఆఫ్ బరోడా యూపీఐ గ్లోబల్ రివర్స్ యాక్సెప్టెన్స్ ప్రారంభించింది. విదేశీ పర్యాటకులు తమ దేశ పేమెంట్ యాప్‌లతో భారత్‌లో చెల్లింపులు చేయవచ్చు.
విదేశాల నుంచి భారత్‌కు వచ్చే పర్యాటకులు, ఓవర్సీస్ ఇండియన్స్, అలాగే అర్హత ఉన్న దేశాల్లోని విదేశీ వాలెట్ లేదా పేమెంట్ యాప్‌లను వాడేవారికి బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక వీరు తమ దేశంలో వాడే బ్యాంకింగ్ లేదా పేమెంట్ యాప్‌తోనే భారత్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా యూపీఐ క్యూఆర్ కోడ్ ఉన్న వ్యాపార సంస్థల్లో నేరుగా చెల్లింపులు చేయొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ సదుపాయాన్ని యూపీఐ గ్లోబల్ రివర్స్ యాక్సెప్టెన్స్ పేరుతో ప్రారంభించింది. దీని వల్ల అంతర్జాతీయ పర్యాటకులకు భారత్‌లో డిజిటల్ పేమెంట్లు మరింత సులభం కానున్నాయి. అదే సమయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా యూపీఐ క్యూఆర్ ఉన్న వ్యాపారులకు కూడా మరింత పెద్ద కస్టమర్ బేస్ అందుబాటులోకి వస్తుంది.

