Last Updated:
Trump Towers Hyderabad: హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై AI బూమ్ ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా అధిక ఆదాయం, RSUల ద్వారా సంపద పొందుతున్న టెక్ ఉద్యోగులు కోకాపేట్‌లోని ప్రీమియం ప్రాజెక్టులపై ఆసక్తి చూపుతున్నారు. ట్రంప్ టవర్స్ హైదరాబాద్‌లో పలువురు NVIDIA ఉద్యోగులు యూనిట్లు కొనుగోలు చేసినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సతీష్ రెడ్డి న్యూస్18 తెలుగుకు తెలిపారు.
హైదరాబాద్‌లోని లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ‘ఏఐ గోల్డ్ రష్’ ప్రభావం కనిపిస్తోందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, రియల్ క్రక్స్ ప్రాపర్టీస్ ఎల్ఎల్పీ వ్యవస్థాపకుడు సతీష్ రెడ్డి న్యూస్18 తెలుగుకు వెల్లడించారు. కృత్రిమ మేధ (AI) రంగంలో వేగంగా పెరుగుతున్న అవకాశాలు, ఉద్యోగుల ఆదాయాలు, స్టాక్ ఆధారిత పరిహారం వంటి అంశాలు హైదరాబాద్‌లోని ప్రీమియం ప్రాపర్టీలపై ఆసక్తిని పెంచుతున్నాయని ఆయన చెప్పారు.

