ఎన్ని సార్లు విన్నా, చదివినా, చూసినా సరే మళ్లీ మళ్లీ వినాలనిపించే, చదవాలనిపించే, చూడాలనిపించే గొప్ప ఇతిహాస కథల్లో మహాభారతం ఒకటి. అసలు మహాభారతంలో ప్రతీ పాత్ర ఒక అద్భుతమే. అందుకే ఇప్పటి వరకు ఈ కథతో ఎన్ని సినిమాలు, సిరీయల్స్, సిరీస్‌లు వచ్చినా ఆదరిస్తూనే ఉన్నాం. అలాంటిది ఇప్పుడు ఒక తెలుగు దర్శకుడు రమేశ్ వర్మ మహాభారతంలో కీలకపాత్ర అయిన కర్ణుడిపై ఓ సినిమా చేస్తున్నాడు. అదే మహావీర్ కర్ణ. ఇది మాములు సినిమా కాదు. ఇదొక లైవ్ యాక్షన్ సినిమా. అంటే నిజమైన యాక్టర్స్‌తో షూటింగ్ చేసి దాన్ని యానిమేషన్‌లో కన్వర్ట్ చేసి చూపించే సినిమా. దీని తాలుకూ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దాదాపు 2 నిమిషాలకు పైగా నిడివితో ఉన్న ఈ టీజర్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమాలో ధనుంజయ వర్మ కర్ణుడిగా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కాబోతుంది.
Source link
Mahaveera Karna: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'మహావీర్ కర్ణ' టీజర్.. విజువల్స్ ఈ రేంజ్‌లో ఉన్నాయేంట్రా బాబూ..!
