Last Updated:
మీ ఇంట్లో ఉన్న పాత ఫోన్, ఫర్నిచర్ లేదా బంగారు నగలను అమ్మాలని చూస్తున్నారా? అయితే ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ప్రతి వస్తువు అమ్మకంపై ట్యాక్స్ ఉండదు.. కానీ కొన్ని వస్తువులకు వ్యక్తిగత వినియోగం అనే మినహాయింపు వర్తించదు. మరి ఏ వస్తువులకు ట్యాక్స్ లేదు?
ఇంట్లో ఉపయోగం లేకుండా ఉన్న పాత మొబైల్, ల్యాప్టాప్, ఫర్నిచర్ లేదా నగలను విక్రయించి డబ్బు పొందడం సాధారణమే. అయితే ఒక ఆస్తిని కొనుగోలు చేసిన ధర కంటే ఎక్కువకు విక్రయించి లాభం పొందితే సాధారణంగా ఆ లాభాన్ని క్యాపిటల్ గెయిన్గా పరిగణించి ఆదాయపు పన్ను విధించే అవకాశం ఉంటుంది. అయితే వ్యక్తిగత వినియోగంలో ఉన్న ప్రతి వస్తువును విక్రయించినప్పుడు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను నిబంధనల్లోని ‘Personal Effects’ అనే ప్రత్యేక మినహాయింపు దీనికి కారణం.

