ఎఫ్వై26లో కంపెనీ ఆస్తుల నిర్వహణ విలువ, అంటే ఏయూఎం, ఏడాది ప్రాతిపదికన 27 శాతం పెరిగి రూ.1,59,916 కోట్లకు చేరింది. ఇందులో రిటైల్, ఎస్ఎంఈ విభాగాల వాటా 68 శాతంగా ఉంది. ఇదే సమయంలో కంపెనీ ఇచ్చిన మొత్తం రుణాల విలువ 25 శాతం పెరిగి రూ.84,204 కోట్లకు చేరింది. ఎఫ్వై27 తొలి త్రైమాసికంలో కూడా కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో ఏయూం ఏడాది ప్రాతిపదికన 28 శాతం పెరిగి రూ.1,67,456 కోట్లకు చేరింది. రుణాల పంపిణీ 34 శాతం పెరిగి రూ.21,201 కోట్లకు చేరింది. మొత్తంగా చూస్తే, భారత్‌లో బంగారం ధరలు పెరగడం, గోల్డ్ లోన్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఈ రంగంలోకి అడుగుపెట్టింది. మూడు ఏళ్లలో 1,000 బ్రాంచ్‌లకు చేరుకోవాలన్న లక్ష్యంతో కంపెనీ తన గోల్డ్ లోన్ బిజినెస్‌ను వేగంగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
