మొదట మీకు సరిపోయే క్రెడిట్ కార్డును ఎంచుకోవాలి. ఒక్కో క్రెడిట్ కార్డ్ ఒక్కో రకమైన ఖర్చులకు అనుగుణంగా ఉంటుంది. కొన్ని కార్డులు రోజువారీ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ ఇస్తాయి. మరికొన్ని ట్రావెల్, షాపింగ్, ఫ్యూయల్ సేవింగ్స్, రివార్డ్ పాయింట్లు లేదా ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌పై ఎక్కువ ప్రయోజనాలు అందిస్తాయి. జియోఫైనాన్స్ యాప్‌లో ప్రముఖ బ్యాంకులకు చెందిన 70కి పైగా లైఫ్‌టైమ్-ఫ్రీ, పెయిడ్ క్రెడిట్ కార్డులను ఒకే ప్లాట్‌ఫామ్‌లో పోల్చుకోవచ్చు. ఒక్కో బ్యాంక్ వెబ్‌సైట్‌ను విడివిడిగా చూడాల్సిన అవసరం లేకుండా కార్డుల ఫీచర్లు, యాన్యువల్ ఫీజు, జాయినింగ్ ఫీజు, రివార్డులు, ఫ్యూయల్ బెనిఫిట్స్, కాంప్లిమెంటరీ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, కొన్ని కార్డుల్లో రైల్వే లాంజ్ యాక్సెస్, బై వన్ గెట్ వన్ మూవీ ఆఫర్లు, షాపింగ్ డిస్కౌంట్లు, మైల్‌స్టోన్ రివార్డులు వంటి వాటిని పోల్చుకోవచ్చు. ముందుగానే కార్డులను పోల్చి చూస్తే, మీ ఖర్చుల విధానానికి బాగా సరిపోయే ప్రయోజనాలు ఉన్న కార్డును ఎంచుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
