Last Updated:
PIB Fact Check: ఆధార్ కార్డు ఉంటే ఉచిత స్కూటర్, మొబైల్ ఫోన్, మొబైల్ రీఛార్జ్ అందిస్తామంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన AI-సృష్టిత వీడియోలను ఉపయోగించి జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా నకిలీదని PIB Fact Check స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు ఆఫర్లను నమ్మి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం లేదా OTPలను ఎవరితోనూ పంచుకోవద్దని ప్రజలను హెచ్చరించింది.
ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత స్కూటర్లు, మొబైల్ ఫోన్లు, ఉచిత రీఛార్జ్‌లు అందిస్తామని పేర్కొంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోలను ఉపయోగించి కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది. ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించింది.

