Last Updated:
హైదరాబాద్‌కు చెందిన Active.in దక్షిణ భారతదేశంలో భారీ విస్తరణకు సిద్ధమైంది. రాబోయే 12–18 నెలల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, భువనేశ్వర్ మార్కెట్లలో 15 కొత్త ఫ్రాంచైజీ అవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. కొత్త షోరూమ్‌లు, ప్రాంతీయ తయారీ సామర్థ్యాలను పెంచడం ద్వారా నిర్మాణ, స్మార్ట్-బిల్డింగ్ విభాగాల్లో పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
హైదరాబాద్‌కు చెందిన ప్రీమియం కిటికీలు, ఫసాడ్‌లు, రైలింగ్‌లు, ఆటోమేషన్, స్మార్ట్-బిల్డింగ్ పరిష్కారాలను అందించే యాక్టివ్ గ్రీన్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Active.in) దక్షిణ భారతదేశంలో భారీ విస్తరణకు సిద్ధమైంది. రాబోయే 12 నుంచి 18 నెలల్లో 15 కొత్త ఫ్రాంచైజీ అవుట్‌లెట్లను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ విస్తరణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవాతో పాటు భువనేశ్వర్ మార్కెట్‌ను కూడా కంపెనీ కవర్ చేయనుంది.

