Last Updated:
ప్రముఖ బ్యాంకులో భారీ గోల్ మాల్ బయటపడింది. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి.
నమ్మకమే పునాదిగా సాగే బ్యాంకింగ్ వ్యవస్థలో దొంగలు పడ్డారు. అత్యవసర అవసరాలు తీర్చుకోవడానికి సామాన్యులు తమ కష్టార్జితమైన బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెడుతుంటారు. ఆభరణాల నాణ్యత, బరువు ఆధారంగా మార్కెట్ విలువలో 75 శాతం వరకు రుణం తీసుకుని అవసరాలు తీర్చుకుంటారు. తాము తాకట్టు పెట్టిన ఆభరణాలను బ్యాంకులు అత్యంత సురక్షితమైన వాల్టులలో భద్రపరుస్తాయనేది ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇలాంటి నమ్మకంతోనే ఎంతోమంది తమ ఇళ్లలో కన్నా బ్యాంకుల్లోనే బంగారం సేఫ్‌గా ఉంటుందని భావించి నిర్భయంగా ఆభరణాలను అప్పగిస్తారు. కానీ, కంచే చేను మేసిన చందంగా సాక్షాత్తూ రక్షకులే భక్షకులుగా మారితే ఆ సామాన్యుల పరిస్థితి ఏంటి? తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసి ఖాతాదారుల గుండెల్లో గుబులు రేపుతోంది.
