మార్కెట్‌లో, పూజా స్టోర్లలో గంగాజలం బాటిల్స్ అమ్ముతుంటారు. అయితే అది ఒరిజినల్ గంగాజలమో కాదో అన్న సందేహం ఉంటుంది. మీకూ అలాంటి సందేహం ఉందా? మీరు ఒరిజినల్ గంగాజలాన్ని మీ ఇంటికి తెప్పించుకోవచ్చు. పూజా కార్యక్రమాల్లో గంగాజలానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. గంగాజలాన్ని పవిత్రతకు, ఆధ్యాత్మిక శుద్ధికి ప్రతీకగా భావిస్తారు. పూజలు, అభిషేకాలు, ఇతర పవిత్ర కార్యక్రమాల్లో దీన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో శివుడికి చేసే పూజల్లో గంగాజలంతో అభిషేకం చేయడం ఎంతో ప్రాముఖ్యంగా భావిస్తారు. గంగాజలాన్ని దేవుడికి సమర్పించడం ద్వారా భక్తి, నమ్మకాన్ని వ్యక్తం చేయడమే కాకుండా శాంతి, ఆరోగ్యం, సంతోషం, కుటుంబ క్షేమం కోసం ఆశీర్వాదాలు కోరుతారు. పూజా ఆచారాలకు మాత్రమే కాకుండా గంగాజలానికి మన దేశంలో తరతరాలుగా వస్తున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం కూడా ఉంది. (image: AI Generated)

