మధుమాలతి మొక్కను సాధారణంగా ఇంటి ఆవరణలో అందంగా కనిపించే అలంకార మొక్కగానే చాలామంది భావిస్తారు. అయితే సంప్రదాయ వైద్యంలో ఈ మొక్కలోని ఆకులు, పూలు, వేర్లు, విత్తనాలను వివిధ ఆరోగ్య సమస్యలకు ఉపయోగించినట్లు చెబుతారు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, జలుబు, దగ్గు, చర్మ సమస్యలు వంటి వాటికి మధుమాలతిని సంప్రదాయ చికిత్సల్లో ఉపయోగించినట్లు ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మొక్కలోని ఏ భాగాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎవరికి సరిపోతుంది అనే విషయంలో నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

