ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలోనూ కీలకంగా మారిపోయింది. నిద్రలేవగానే ఫోన్ చేతిలోకి తీసుకోవడం, వాట్సాప్ మెసేజ్లు, సోషల్ మీడియా నోటిఫికేషన్లు, వార్తలు, వాతావరణ సమాచారం వంటివి చెక్ చేయడం చాలామందికి రోజువారీ అలవాటుగా మారింది. అయితే ఉదయం నిద్రలేచిన వెంటనే ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల సమయం వృథా కావడంతో పాటు మానసిక స్థితి, ఏకాగ్రత, రోజువారీ పనులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

