ప్రభన్యూస్

This Month Movie Releases: ఆగస్టు నెల బాక్సాఫీస్ జాతర.. ‘టాక్సిక్’ సహా ఈ నెల రిలీజ్ కాబోతున్న బిగ్ మూవీస్ ఇవే.. | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ ఆగస్టు నెల పక్కా వినోదాల విందు అందించబోతోంది. థియేటర్ల దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లు క్యూ కట్టాయి. ఆ వివరాలు చూస్తే..

News18
News18

టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ ఆగస్టు నెల పక్కా వినోదాల విందు అందించబోతోంది. థియేటర్ల దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లు క్యూ కట్టాయి. మాస్ యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్, గ్లోబల్ రేంజ్ ప్రాజెక్ట్స్.. ఇలా అన్ని రకాల జోనర్స్ ఈ నెలలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటానికి సిద్ధమయ్యాయి. ముఖ్యంగా యశ్, నాని, రవితేజ, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఒకే నెలలో వస్తుండటంతో థియేటర్ల దగ్గర వాతావరణం పీక్స్‌కు చేరింది. ఈ ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ మోస్ట్ అవైటెడ్ సినిమాల ఫుల్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

ఆగస్టు 7 నుండి స్టార్ట్.. వారం వారం పూనకాలే..

ఈ నెల మొదటి వారంలోనే వినూత్నమైన కాన్సెప్ట్‌తో వస్తున్న ‘కొరియన్ కనకరాజు’ సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆ తర్వాత సీనియర్ మేకర్ ఎమ్‌ఎస్ రాజు డైరెక్షన్‌లో వస్తున్న సైకోలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘అగధ’. సస్పెన్స్, మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో రచ్చ లేపడానికి సిద్ధమైంది. అదేవిధంగా యంగ్ అండ్ గ్లోబల్ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఐ యామ్ గేమ్’. డిఫరెంట్ మేకింగ్‌తో రాబోతున్న ఈ సినిమా ఆగస్టు 20న బిగ్ స్క్రీన్ పై సందడి చేయనుంది.

ఆగస్టు 21న బాక్సాఫీస్ క్లాష్.. మాస్ రాజా vs నేచురల్ స్టార్:

ఈ నెలలో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఫైట్ ఆగస్టు 21న జరగబోతోంది. ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోలు పోటీకి దిగుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. మాస్ మహారాజా రవితేజ తన మార్క్ పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తో వస్తున్న సినిమా ‘ఇరుముడి’. ఆగస్టు 21న ఈ సినిమాతో థియేటర్లలో మాస్ అరాచకం సృష్టించడానికి రవితేజ సిద్ధమయ్యారు. రవితేజకు పోటీగా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ కూడా అదే రోజు ఆగస్టు 21న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. విభిన్నమైన కథలతో అలరించే నాని ఈసారి ఏ రేంజ్ హిట్ కొడతారో అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

రాకీ భాయ్ రాక..

యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ సినిమా ఆగస్టు 26న గ్లోబల్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్‌లో గోవా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపోతే ఈ నెల చివర్లో శర్వానంద్ తన మార్క్ ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భోగి’తో ఆగస్టు 28న ప్రేక్షకులను పలకరించబోతున్నారు. మొత్తానికి ఈ ఆగస్టు నెలలో వారం వారం ఒక బిగ్ మూవీ థియేటర్లలో వస్తుండటంతో సినిమా లవర్స్‌ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 August 2026, 3:37 pm Digital Edition : Prabhanews
This Month Movie Releases: ఆగస్టు నెల బాక్సాఫీస్ జాతర.. ‘టాక్సిక్’ సహా ఈ నెల రిలీజ్ కాబోతున్న బిగ్ మూవీస్ ఇవే.. | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 01, 2026 3:31 PM ISTటాలీవుడ్ ప్రేక్షకులకు ఈ ఆగస్టు నెల పక్కా వినోదాల విందు అందించబోతోంది. థియేటర్ల దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లు క్యూ కట్టాయి. ఆ వివరాలు చూస్తే.. News18టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ ఆగస్టు నెల పక్కా వినోదాల విందు అందించబోతోంది. థియేటర్ల దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లు క్యూ కట్టాయి. మాస్ యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్, గ్లోబల్ రేంజ్ ప్రాజెక్ట్స్.. ఇలా అన్ని రకాల జోనర్స్ ఈ నెలలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటానికి సిద్ధమయ్యాయి. ముఖ్యంగా యశ్, నాని, రవితేజ, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఒకే నెలలో వస్తుండటంతో థియేటర్ల దగ్గర వాతావరణం పీక్స్‌కు చేరింది. ఈ ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ మోస్ట్ అవైటెడ్ సినిమాల ఫుల్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.ఆగస్టు 7 నుండి స్టార్ట్.. వారం వారం పూనకాలే..ఈ నెల మొదటి వారంలోనే వినూత్నమైన కాన్సెప్ట్‌తో వస్తున్న 'కొరియన్ కనకరాజు' సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆ తర్వాత సీనియర్ మేకర్ ఎమ్‌ఎస్ రాజు డైరెక్షన్‌లో వస్తున్న సైకోలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'అగధ'. సస్పెన్స్, మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో రచ్చ లేపడానికి సిద్ధమైంది. అదేవిధంగా యంగ్ అండ్ గ్లోబల్ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఐ యామ్ గేమ్'. డిఫరెంట్ మేకింగ్‌తో రాబోతున్న ఈ సినిమా ఆగస్టు 20న బిగ్ స్క్రీన్ పై సందడి చేయనుంది.ఆగస్టు 21న బాక్సాఫీస్ క్లాష్.. మాస్ రాజా vs నేచురల్ స్టార్:ఈ నెలలో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఫైట్ ఆగస్టు 21న జరగబోతోంది. ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోలు పోటీకి దిగుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. మాస్ మహారాజా రవితేజ తన మార్క్ పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తో వస్తున్న సినిమా 'ఇరుముడి'. ఆగస్టు 21న ఈ సినిమాతో థియేటర్లలో మాస్ అరాచకం సృష్టించడానికి రవితేజ సిద్ధమయ్యారు. రవితేజకు పోటీగా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్' కూడా అదే రోజు ఆగస్టు 21న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. విభిన్నమైన కథలతో అలరించే నాని ఈసారి ఏ రేంజ్ హిట్ కొడతారో అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.రాకీ భాయ్ రాక..యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' సినిమా ఆగస్టు 26న గ్లోబల్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్‌లో గోవా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపోతే ఈ నెల చివర్లో శర్వానంద్ తన మార్క్ ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'భోగి'తో ఆగస్టు 28న ప్రేక్షకులను పలకరించబోతున్నారు. మొత్తానికి ఈ ఆగస్టు నెలలో వారం వారం ఒక బిగ్ మూవీ థియేటర్లలో వస్తుండటంతో సినిమా లవర్స్‌ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link