ప్రభన్యూస్

PM Modi: మాట నిలబెట్టుకున్న ప్రధాని మోదీ.. నీట్ పేపర్ లీక్ కేసులో 13 మందిపై CBI ఛార్జ్‌షీట్.. |


Last Updated:

NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో CBI కీలక చర్యలు చేపట్టింది. 13 మంది అరెస్టు చేసిన నిందితులపై రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

News18
News18

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కీలక ముందడుగు వేసింది. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో అరెస్టైన 13 మంది నిందితులపై ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో సీబీఐ తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి చెందిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులు, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, మధ్యవర్తుల పేర్లు చేర్చినట్లు వెల్లడైంది.

వైద్య విద్యలో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసే NEET-UG పరీక్షలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు దర్యాప్తును వేగవంతం చేసిన సీబీఐ, నిందితులపై పక్కా ఆధారాలతో కోర్టును ఆశ్రయించింది. పేపర్ లీక్ కేసు విచారణ కోసం త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు అవసరమని ప్రధాని గతంలో వీడియో సందేశం ద్వారా పేర్కొన్నారు.

సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో 360 మంది సాక్షుల వాంగ్మూలాలు, 422 కీలక పత్రాలు, 43 భౌతిక ఆధారాలను సమర్పించింది. ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం క్రిమినల్ కుట్ర, మోసం, ఆధారాల ధ్వంసం, అవినీతి నిరోధక చట్టాల కింద జరిగినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS), పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్-2024తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని పలు తీవ్రమైన సెక్షన్లు నమోదు చేశారు. ప్రస్తుతం 13 మంది నిందితులు న్యాయస్థానం ఆదేశాలతో జైలులో ఉన్నారు.

2026 మే 3న నిర్వహించిన NEET-UG పరీక్షలో అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో సీబీఐ మే 12న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దర్యాప్తు కోసం 72 మంది అధికారులు, 8 మంది సైబర్ ఫోరెన్సిక్ నిపుణులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అనంతరం మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో 92 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, పేపర్ లీక్‌కు సంబంధించిన మూలాలు, లబ్ధిదారుల వరకు ఉన్న నెట్‌వర్క్‌ను గుర్తించారు.

ఈ కేసులో ప్రధానంగా ఆశ్చర్యపరిచిన అంశం.. అరెస్టైన 13 మందిలో NTAకి చెందిన కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ విభాగాల ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులు ఉండటం. ప్రశ్నపత్రాన్ని అక్రమ మార్గాల్లో పొందిన కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఇద్దరితో పాటు పలువురు మధ్యవర్తులను కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది.

దర్యాప్తులో భాగంగా నిందితుల ఆర్థిక లావాదేవీలపై కూడా అధికారులు దృష్టి సారించారు. వారి బ్యాంకు ఖాతాలు, బ్యాంకు లాకర్లు, ఒక డీమ్యాట్ ఖాతాను స్తంభింపజేశారు. అక్రమాలకు పాల్పడిన వారి ఆర్థిక నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేందుకు సీబీఐ చర్యలు కొనసాగిస్తోంది.

NEET-UG వంటి కీలక పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన పరిణామాలు తప్పవనే సందేశాన్ని ఈ చర్యల ద్వారా సీబీఐ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ విచారణకు మార్గం సుగమం కావడంతో, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వారిపై చట్టపరమైన చర్యలు మరింత వేగవంతం కానున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 July 2026, 11:03 pm Digital Edition : Prabhanews
PM Modi: మాట నిలబెట్టుకున్న ప్రధాని మోదీ.. నీట్ పేపర్ లీక్ కేసులో 13 మందిపై CBI ఛార్జ్‌షీట్.. |

Last Updated:Jul 28, 2026 10:49 PM ISTNEET-UG 2026 పేపర్ లీక్ కేసులో CBI కీలక చర్యలు చేపట్టింది. 13 మంది అరెస్టు చేసిన నిందితులపై రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
News18దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కీలక ముందడుగు వేసింది. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో అరెస్టైన 13 మంది నిందితులపై ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో సీబీఐ తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి చెందిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులు, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, మధ్యవర్తుల పేర్లు చేర్చినట్లు వెల్లడైంది.వైద్య విద్యలో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసే NEET-UG పరీక్షలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు దర్యాప్తును వేగవంతం చేసిన సీబీఐ, నిందితులపై పక్కా ఆధారాలతో కోర్టును ఆశ్రయించింది. పేపర్ లీక్ కేసు విచారణ కోసం త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు అవసరమని ప్రధాని గతంలో వీడియో సందేశం ద్వారా పేర్కొన్నారు.సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో 360 మంది సాక్షుల వాంగ్మూలాలు, 422 కీలక పత్రాలు, 43 భౌతిక ఆధారాలను సమర్పించింది. ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం క్రిమినల్ కుట్ర, మోసం, ఆధారాల ధ్వంసం, అవినీతి నిరోధక చట్టాల కింద జరిగినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS), పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్-2024తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని పలు తీవ్రమైన సెక్షన్లు నమోదు చేశారు. ప్రస్తుతం 13 మంది నిందితులు న్యాయస్థానం ఆదేశాలతో జైలులో ఉన్నారు.2026 మే 3న నిర్వహించిన NEET-UG పరీక్షలో అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో సీబీఐ మే 12న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దర్యాప్తు కోసం 72 మంది అధికారులు, 8 మంది సైబర్ ఫోరెన్సిక్ నిపుణులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అనంతరం మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో 92 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, పేపర్ లీక్‌కు సంబంధించిన మూలాలు, లబ్ధిదారుల వరకు ఉన్న నెట్‌వర్క్‌ను గుర్తించారు.ఈ కేసులో ప్రధానంగా ఆశ్చర్యపరిచిన అంశం.. అరెస్టైన 13 మందిలో NTAకి చెందిన కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ విభాగాల ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులు ఉండటం. ప్రశ్నపత్రాన్ని అక్రమ మార్గాల్లో పొందిన కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఇద్దరితో పాటు పలువురు మధ్యవర్తులను కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది.దర్యాప్తులో భాగంగా నిందితుల ఆర్థిక లావాదేవీలపై కూడా అధికారులు దృష్టి సారించారు. వారి బ్యాంకు ఖాతాలు, బ్యాంకు లాకర్లు, ఒక డీమ్యాట్ ఖాతాను స్తంభింపజేశారు. అక్రమాలకు పాల్పడిన వారి ఆర్థిక నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేందుకు సీబీఐ చర్యలు కొనసాగిస్తోంది.NEET-UG వంటి కీలక పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన పరిణామాలు తప్పవనే సందేశాన్ని ఈ చర్యల ద్వారా సీబీఐ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ విచారణకు మార్గం సుగమం కావడంతో, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వారిపై చట్టపరమైన చర్యలు మరింత వేగవంతం కానున్నాయి.Click here to add News18 as your preferred news source on Google. బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,TelanganaFirst Published :Jul 28, 2026 10:49 PM ISTమరింత చదవండి

Source link