కేవలం గ్లింప్స్, పాటలతోనే తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సినిమా చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీ గౌరీ ప్రియా రెడ్డి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రవి అబ్బూరి దర్శకత్వం వహించాడు. కలర్ ఫోటో, బేబి సినిమాలతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు, రైటర్ సాయి రాజేష్ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేతో పాటు నిర్మాతగా కూడా వ్యవహిరించడంతో ముందు నుంచి ఈ సినిమాపై జనాల్లో తిరుగులేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.

