ప్రభన్యూస్

Viral House Story: గాల్లోకి ఇళ్లు లేపడం ఎప్పుడైనా చూశారా?.. ఆంధ్ర ప్రదేశ్‌లో అద్భుతం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

సాధారణంగా పాత ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటే వాటిని కూల్చి కొత్త ఇల్లు నిర్మించడం చూస్తుంటాం. కానీ ఏలూరు జిల్లాలో ఓ ఇంటి యజమాని మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించాడు.

+

News18

News18

సాధారణంగా పాత ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటే వాటిని కూల్చి కొత్త ఇల్లు నిర్మించడం చూస్తుంటాం. కానీ ఏలూరు జిల్లాలో ఓ ఇంటి యజమాని మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించాడు. తన తండ్రి నిర్మించిన ఇంటిని కూల్చేందుకు మనసొప్పక, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా మొత్తం ఇంటినే ఐదు అడుగుల ఎత్తుకు పైకి లేపించాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఈ ఇంటి వీడియోలు వైరల్ అవుతుండటంతో అసలు ఒక ఇంటిని కూల్చకుండా ఎలా పైకి లేపగలిగారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన దోబగుంట్ల వెంకటేశ్వరరావు నివాసం 1985లో ఆయన తండ్రి నిర్మించారు. కుటుంబానికి ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చిన ఈ ఇంటిపై వెంకటేశ్వరరావుకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అయితే కాలక్రమేణా ఆ ప్రాంతంలో రహదారులు ఎత్తు చేయడం, చుట్టుపక్కల భూములను కూడా మెరక చేయడంతో ఆయన ఇల్లు రోడ్డు స్థాయి కంటే చాలా దిగువకు వెళ్లిపోయింది.

దీంతో ప్రతి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. రోడ్లపై నిలిచిన వర్షపు నీరు, పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు నేరుగా ఇంట్లోకి చేరేది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇంట్లోకి నీరు చేరడంతో కుటుంబ సభ్యులు ప్రతి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఎన్నో మార్గాలు ఆలోచించిన వెంకటేశ్వరరావు చివరకు వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

తండ్రి గుర్తుగా నిలిచిన ఇంటిని కూల్చకుండా, అదే నిర్మాణాన్ని యథాతథంగా ఉంచి ఐదు అడుగుల ఎత్తుకు పైకి లేపించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందాన్ని సంప్రదించారు. వారి సూచనల మేరకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి దాదాపు 500 హైడ్రాలిక్ జాకీల సహాయంతో ఇంటిని జాగ్రత్తగా ఐదు అడుగుల మేర పైకి లేపారు. ఈ ప్రక్రియలో ఇంటి నిర్మాణానికి ఎలాంటి నష్టం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇంటి బరువును సమానంగా పంపిణీ చేస్తూ ప్రతి జాకీని సమన్వయంతో నిర్వహించడం ద్వారా మొత్తం భవనాన్ని నెమ్మదిగా పైకి ఎత్తారు. అనంతరం కొత్త ఎత్తుకు అనుగుణంగా బలమైన పునాది నిర్మించి ఇంటిని శాశ్వతంగా స్థిరపరిచారు. ప్రస్తుతం చూస్తే ఈ ఇల్లు మొదట ఎలా నిర్మించారో అదే రూపంలో కనిపిస్తుండటం విశేషం. అయితే ఇప్పుడు రహదారి కంటే ఎత్తులో ఉండటంతో వర్షపు నీరు ఇంట్లోకి వచ్చే సమస్య పూర్తిగా తొలగిపోయింది.

ఈ వినూత్న నిర్మాణం గురించి తెలిసిన తర్వాత పలువురు ఇంజినీర్లు, నిర్మాణ రంగ నిపుణులు, సాధారణ ప్రజలు కూడా అక్కడికి చేరుకుని ఇంటిని పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. “ఇంటిని కూల్చకుండా ఇలా పైకి లేపడం ఎలా సాధ్యమైంది?” అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

తన తండ్రి జ్ఞాపకంగా ఉన్న ఇంటిని కాపాడుకోవాలనే సంకల్పంతో వెంకటేశ్వరరావు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆధునిక ఇంజినీరింగ్ సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటే పాత నిర్మాణాలను కూల్చివేయకుండా కూడా సంరక్షించవచ్చని ఈ ఘటన మరోసారి నిరూపించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 9:10 am Digital Edition : Prabhanews
Viral House Story: గాల్లోకి ఇళ్లు లేపడం ఎప్పుడైనా చూశారా?.. ఆంధ్ర ప్రదేశ్‌లో అద్భుతం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 27, 2026 6:27 PM ISTసాధారణంగా పాత ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటే వాటిని కూల్చి కొత్త ఇల్లు నిర్మించడం చూస్తుంటాం. కానీ ఏలూరు జిల్లాలో ఓ ఇంటి యజమాని మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించాడు. +
News18సాధారణంగా పాత ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటే వాటిని కూల్చి కొత్త ఇల్లు నిర్మించడం చూస్తుంటాం. కానీ ఏలూరు జిల్లాలో ఓ ఇంటి యజమాని మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించాడు. తన తండ్రి నిర్మించిన ఇంటిని కూల్చేందుకు మనసొప్పక, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా మొత్తం ఇంటినే ఐదు అడుగుల ఎత్తుకు పైకి లేపించాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఈ ఇంటి వీడియోలు వైరల్ అవుతుండటంతో అసలు ఒక ఇంటిని కూల్చకుండా ఎలా పైకి లేపగలిగారనే ఆసక్తి అందరిలో నెలకొంది.ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన దోబగుంట్ల వెంకటేశ్వరరావు నివాసం 1985లో ఆయన తండ్రి నిర్మించారు. కుటుంబానికి ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చిన ఈ ఇంటిపై వెంకటేశ్వరరావుకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అయితే కాలక్రమేణా ఆ ప్రాంతంలో రహదారులు ఎత్తు చేయడం, చుట్టుపక్కల భూములను కూడా మెరక చేయడంతో ఆయన ఇల్లు రోడ్డు స్థాయి కంటే చాలా దిగువకు వెళ్లిపోయింది.దీంతో ప్రతి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. రోడ్లపై నిలిచిన వర్షపు నీరు, పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు నేరుగా ఇంట్లోకి చేరేది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇంట్లోకి నీరు చేరడంతో కుటుంబ సభ్యులు ప్రతి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఎన్నో మార్గాలు ఆలోచించిన వెంకటేశ్వరరావు చివరకు వినూత్న నిర్ణయం తీసుకున్నారు.తండ్రి గుర్తుగా నిలిచిన ఇంటిని కూల్చకుండా, అదే నిర్మాణాన్ని యథాతథంగా ఉంచి ఐదు అడుగుల ఎత్తుకు పైకి లేపించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందాన్ని సంప్రదించారు. వారి సూచనల మేరకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి దాదాపు 500 హైడ్రాలిక్ జాకీల సహాయంతో ఇంటిని జాగ్రత్తగా ఐదు అడుగుల మేర పైకి లేపారు. ఈ ప్రక్రియలో ఇంటి నిర్మాణానికి ఎలాంటి నష్టం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.ఇంటి బరువును సమానంగా పంపిణీ చేస్తూ ప్రతి జాకీని సమన్వయంతో నిర్వహించడం ద్వారా మొత్తం భవనాన్ని నెమ్మదిగా పైకి ఎత్తారు. అనంతరం కొత్త ఎత్తుకు అనుగుణంగా బలమైన పునాది నిర్మించి ఇంటిని శాశ్వతంగా స్థిరపరిచారు. ప్రస్తుతం చూస్తే ఈ ఇల్లు మొదట ఎలా నిర్మించారో అదే రూపంలో కనిపిస్తుండటం విశేషం. అయితే ఇప్పుడు రహదారి కంటే ఎత్తులో ఉండటంతో వర్షపు నీరు ఇంట్లోకి వచ్చే సమస్య పూర్తిగా తొలగిపోయింది.ఈ వినూత్న నిర్మాణం గురించి తెలిసిన తర్వాత పలువురు ఇంజినీర్లు, నిర్మాణ రంగ నిపుణులు, సాధారణ ప్రజలు కూడా అక్కడికి చేరుకుని ఇంటిని పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. "ఇంటిని కూల్చకుండా ఇలా పైకి లేపడం ఎలా సాధ్యమైంది?" అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.తన తండ్రి జ్ఞాపకంగా ఉన్న ఇంటిని కాపాడుకోవాలనే సంకల్పంతో వెంకటేశ్వరరావు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆధునిక ఇంజినీరింగ్ సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటే పాత నిర్మాణాలను కూల్చివేయకుండా కూడా సంరక్షించవచ్చని ఈ ఘటన మరోసారి నిరూపించింది.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link