ప్రభన్యూస్

AP News: ఆక్వా రైతులకు అండగా నిలవాలి.. కిసాన్ క్రెడిట్ కార్డుపై టాప్-అప్ ఇవ్వండి.. కేంద్ర మంత్రులకు సీఎం లేఖ | ఆంధ్రప్రదేశ్ వార్తలు


రొయ్యల మేత కోసం జీఎం సోయాబీన్ మీల్ 

కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌కు రాసిన లేఖలో, రొయ్యల మేత తయారీలో ప్రధాన ముడిసరుకైన సోయాబీన్ మీల్ ధరలు భారీగా పెరగడంతో మేత తయారీ ఖర్చులు పెరిగి, రొయ్యల రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని చంద్రబాబు వివరించారు. ఈ సమస్యకు పరిష్కారంగా జన్యుపరంగా మార్పు చేసిన (జీఎం) సోయాబీన్ మీల్‌ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీదారులకు అనుమతి ఇవ్వాలని కోరారు.

2021లో కూడా పరిమిత స్థాయిలో ఇలాంటి దిగుమతులకు కేంద్రం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. జీఎం సోయాబీన్‌ను వ్యవసాయ సాగు లేదా విత్తనాల ఉత్పత్తికి వినియోగించరని, అందువల్ల జీవ వైవిధ్యానికి లేదా దేశీయ వంగడాలకు ఎలాంటి ముప్పు ఉండదని స్పష్టం చేశారు. ఈ అనుమతి లభిస్తే నాణ్యమైన ముడిసరుకు అందుబాటులోకి రావడంతో పాటు రొయ్యల మేత ధరలు నియంత్రణలోకి వస్తాయని, లక్షలాది మంది రైతులు, కార్మికులకు ఉపాధి భద్రత లభిస్తుందని, విదేశీ మారకద్రవ్యం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.

అలాగే ఈక్వెడార్ నుంచి రొయ్యల ఉత్పత్తి, ఎగుమతులు పెరగడంతో అమెరికా, చైనా, యూరప్ వంటి ప్రధాన మార్కెట్లలో భారతీయ రొయ్యల ఎగుమతులు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయని ఆయన వివరించారు.

అమరావతిలో ఎన్ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయం

మరో విజ్ఞప్తిలో ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధికి తోడ్పడేలా జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (NFDB) ప్రాంతీయ కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ఈ ఏడాది జూన్ 5న విశాఖపట్నంలో నిర్వహించిన సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ వర్క్‌షాప్‌లో కేంద్ర మంత్రి ఇచ్చిన హామీని గుర్తు చేశారు.

అమరావతి సమీపంలోని నెక్కల్లు గ్రామంలో 7.89 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రాంతీయ కార్యాలయం, శిక్షణ కేంద్రం, ఆక్వా పార్క్, ప్రజల సందర్శన కోసం అక్వేరియం ఏర్పాటుకు ఇప్పటికే కేటాయించామని తెలిపారు. ఈ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకుని నిర్మాణ పనులు ప్రారంభించి, 2028 నాటికి ఈ ప్రాజెక్టులను పూర్తిచేయాలని కోరారు. ఈ కేంద్రం బ్లూ ఎకానమీకి కీలక హబ్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు.

ఫిష్ మీల్ ఎగుమతులు

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌కు రాసిన లేఖలో, దేశీయ రొయ్యల మేత తయారీదారులకు అవసరమైన ఫిష్ మీల్ అందుబాటులో ఉండేలా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ద్వారా ఎగుమతులను నియంత్రించాలని సీఎం సూచించారు.

ప్రస్తుతం చేప పొడిని 5 శాతం ప్రోత్సాహకాలతో ఎగుమతి చేయడం వల్ల దేశీయ పరిశ్రమలు అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని తెలిపారు. ముందుగా దేశీయ అవసరాలు తీర్చిన తర్వాతే ఎగుమతులకు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే జీఎం సోయాబీన్ మీల్ దిగుమతికి కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు 

ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది రైతుల జీవనాధారమైన ఎఫ్‌సీవీ (ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా) పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు అందించాలని సీఎం కోరారు. దేశంలో ఉత్పత్తి అయ్యే ఎఫ్‌సీవీ పొగాకులో సుమారు 70 శాతం ఎగుమతి అవుతుందని పేర్కొన్నారు.

జింబాబ్వే, టాంజానియా వంటి దేశాలు తమ ఎగుమతిదారులకు సబ్సిడీలు, పన్ను రాయితీలు ఇస్తుండగా, భారతీయ ఎగుమతిదారులకు అలాంటి మద్దతు లేకపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర పోటీ ఎదురవుతోందన్నారు. ఆగస్టు 2021లో RoDTEP పథకంలో టీ, కాఫీ, మసాలా దినుసులను చేర్చినా, HS Code 2401 కింద వచ్చే ప్రాసెస్ చేయని పొగాకును చేర్చలేదని గుర్తుచేశారు.

అందువల్ల HS Code 2401-10, 2401-20, 2401-30 కింద ఉన్న ప్రాసెస్ చేయని పొగాకును కూడా RoDTEP ప్రయోజనాల పరిధిలోకి తీసుకురావాలని, అలాగే సమాన వడ్డీ, నిర్యాత్ ప్రోత్సాహన్ వంటి పథకాల ప్రయోజనాలు కూడా కల్పించాలని కోరారు.

కిసాన్ క్రెడిట్ కార్డుపై టాప్-అప్ 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో, ఆక్వాకల్చర్ రంగానికి ఉపయోగించే ఏరియేటర్లపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఆక్వా దిగుమతులపై సుంకం 10 శాతానికి తగ్గినప్పటికీ, ఇంకా చట్టపరమైన అనిశ్చితి కొనసాగుతోందని పేర్కొంటూ టారిఫ్ సమస్యలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.

ఆక్వా రైతులకు ఊరటగా కిసాన్ క్రెడిట్ కార్డుపై రూ.5 లక్షల వరకు ఒకేసారి టాప్-అప్ సౌకర్యం కల్పించాలని, దేశీయ మార్కెటింగ్‌కు NFDB ద్వారా రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు, రొయ్యల ఎగుమతులు పెరిగేలా సబ్సిడీలు, సామర్థ్య విస్తరణ చర్యలు చేపట్టాలని సూచించారు.

అదే విధంగా HSN Code 2401 కింద ఉన్న ప్రాసెస్ చేయని పొగాకుపై ప్రస్తుతం ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని కోరారు. దీంతో రైతులు, డీలర్లు, ఎగుమతిదారులపై ఆర్థిక భారం తగ్గుతుందని, వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు తగ్గి రైతులకు సకాలంలో చెల్లింపులు చేయడం సులభమవుతుందని సీఎం తన లేఖల్లో స్పష్టం చేశారు.

ఈ సందేశం ఇప్పుడే వచ్చింది. మీరు News18 తెలుగు వెబ్‌సైట్ ద్వారా చాలా వేగంగా పొందవచ్చు మరియు చదవవచ్చు. మేము మరింత సమాచారం పొందినప్పుడు మేము ఈ పోస్ట్‌ను అప్‌డేట్ చేస్తాము. అన్ని వార్తలు మరియు అప్‌డేట్‌లను వెంటనే పొందడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి. ముందుగా అన్ని వార్తలను పొందండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 July 2026, 9:51 am Digital Edition : Prabhanews
AP News: ఆక్వా రైతులకు అండగా నిలవాలి.. కిసాన్ క్రెడిట్ కార్డుపై టాప్-అప్ ఇవ్వండి.. కేంద్ర మంత్రులకు సీఎం లేఖ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

రొయ్యల మేత కోసం జీఎం సోయాబీన్ మీల్ కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌కు రాసిన లేఖలో, రొయ్యల మేత తయారీలో ప్రధాన ముడిసరుకైన సోయాబీన్ మీల్ ధరలు భారీగా పెరగడంతో మేత తయారీ ఖర్చులు పెరిగి, రొయ్యల రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని చంద్రబాబు వివరించారు. ఈ సమస్యకు పరిష్కారంగా జన్యుపరంగా మార్పు చేసిన (జీఎం) సోయాబీన్ మీల్‌ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీదారులకు అనుమతి ఇవ్వాలని కోరారు.2021లో కూడా పరిమిత స్థాయిలో ఇలాంటి దిగుమతులకు కేంద్రం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. జీఎం సోయాబీన్‌ను వ్యవసాయ సాగు లేదా విత్తనాల ఉత్పత్తికి వినియోగించరని, అందువల్ల జీవ వైవిధ్యానికి లేదా దేశీయ వంగడాలకు ఎలాంటి ముప్పు ఉండదని స్పష్టం చేశారు. ఈ అనుమతి లభిస్తే నాణ్యమైన ముడిసరుకు అందుబాటులోకి రావడంతో పాటు రొయ్యల మేత ధరలు నియంత్రణలోకి వస్తాయని, లక్షలాది మంది రైతులు, కార్మికులకు ఉపాధి భద్రత లభిస్తుందని, విదేశీ మారకద్రవ్యం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.అలాగే ఈక్వెడార్ నుంచి రొయ్యల ఉత్పత్తి, ఎగుమతులు పెరగడంతో అమెరికా, చైనా, యూరప్ వంటి ప్రధాన మార్కెట్లలో భారతీయ రొయ్యల ఎగుమతులు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయని ఆయన వివరించారు.అమరావతిలో ఎన్ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయంమరో విజ్ఞప్తిలో ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధికి తోడ్పడేలా జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (NFDB) ప్రాంతీయ కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ఈ ఏడాది జూన్ 5న విశాఖపట్నంలో నిర్వహించిన సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ వర్క్‌షాప్‌లో కేంద్ర మంత్రి ఇచ్చిన హామీని గుర్తు చేశారు.అమరావతి సమీపంలోని నెక్కల్లు గ్రామంలో 7.89 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రాంతీయ కార్యాలయం, శిక్షణ కేంద్రం, ఆక్వా పార్క్, ప్రజల సందర్శన కోసం అక్వేరియం ఏర్పాటుకు ఇప్పటికే కేటాయించామని తెలిపారు. ఈ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకుని నిర్మాణ పనులు ప్రారంభించి, 2028 నాటికి ఈ ప్రాజెక్టులను పూర్తిచేయాలని కోరారు. ఈ కేంద్రం బ్లూ ఎకానమీకి కీలక హబ్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు.ఫిష్ మీల్ ఎగుమతులుకేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌కు రాసిన లేఖలో, దేశీయ రొయ్యల మేత తయారీదారులకు అవసరమైన ఫిష్ మీల్ అందుబాటులో ఉండేలా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ద్వారా ఎగుమతులను నియంత్రించాలని సీఎం సూచించారు.ప్రస్తుతం చేప పొడిని 5 శాతం ప్రోత్సాహకాలతో ఎగుమతి చేయడం వల్ల దేశీయ పరిశ్రమలు అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని తెలిపారు. ముందుగా దేశీయ అవసరాలు తీర్చిన తర్వాతే ఎగుమతులకు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే జీఎం సోయాబీన్ మీల్ దిగుమతికి కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది రైతుల జీవనాధారమైన ఎఫ్‌సీవీ (ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా) పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు అందించాలని సీఎం కోరారు. దేశంలో ఉత్పత్తి అయ్యే ఎఫ్‌సీవీ పొగాకులో సుమారు 70 శాతం ఎగుమతి అవుతుందని పేర్కొన్నారు.జింబాబ్వే, టాంజానియా వంటి దేశాలు తమ ఎగుమతిదారులకు సబ్సిడీలు, పన్ను రాయితీలు ఇస్తుండగా, భారతీయ ఎగుమతిదారులకు అలాంటి మద్దతు లేకపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర పోటీ ఎదురవుతోందన్నారు. ఆగస్టు 2021లో RoDTEP పథకంలో టీ, కాఫీ, మసాలా దినుసులను చేర్చినా, HS Code 2401 కింద వచ్చే ప్రాసెస్ చేయని పొగాకును చేర్చలేదని గుర్తుచేశారు.అందువల్ల HS Code 2401-10, 2401-20, 2401-30 కింద ఉన్న ప్రాసెస్ చేయని పొగాకును కూడా RoDTEP ప్రయోజనాల పరిధిలోకి తీసుకురావాలని, అలాగే సమాన వడ్డీ, నిర్యాత్ ప్రోత్సాహన్ వంటి పథకాల ప్రయోజనాలు కూడా కల్పించాలని కోరారు.కిసాన్ క్రెడిట్ కార్డుపై టాప్-అప్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో, ఆక్వాకల్చర్ రంగానికి ఉపయోగించే ఏరియేటర్లపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఆక్వా దిగుమతులపై సుంకం 10 శాతానికి తగ్గినప్పటికీ, ఇంకా చట్టపరమైన అనిశ్చితి కొనసాగుతోందని పేర్కొంటూ టారిఫ్ సమస్యలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.ఆక్వా రైతులకు ఊరటగా కిసాన్ క్రెడిట్ కార్డుపై రూ.5 లక్షల వరకు ఒకేసారి టాప్-అప్ సౌకర్యం కల్పించాలని, దేశీయ మార్కెటింగ్‌కు NFDB ద్వారా రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు, రొయ్యల ఎగుమతులు పెరిగేలా సబ్సిడీలు, సామర్థ్య విస్తరణ చర్యలు చేపట్టాలని సూచించారు.అదే విధంగా HSN Code 2401 కింద ఉన్న ప్రాసెస్ చేయని పొగాకుపై ప్రస్తుతం ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని కోరారు. దీంతో రైతులు, డీలర్లు, ఎగుమతిదారులపై ఆర్థిక భారం తగ్గుతుందని, వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు తగ్గి రైతులకు సకాలంలో చెల్లింపులు చేయడం సులభమవుతుందని సీఎం తన లేఖల్లో స్పష్టం చేశారు.ఈ సందేశం ఇప్పుడే వచ్చింది. మీరు News18 తెలుగు వెబ్‌సైట్ ద్వారా చాలా వేగంగా పొందవచ్చు మరియు చదవవచ్చు. మేము మరింత సమాచారం పొందినప్పుడు మేము ఈ పోస్ట్‌ను అప్‌డేట్ చేస్తాము. అన్ని వార్తలు మరియు అప్‌డేట్‌లను వెంటనే పొందడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి. ముందుగా అన్ని వార్తలను పొందండి

Source link