ప్రభన్యూస్

విజయవాడలో దారుణం.. బరువు తగ్గే షేక్ అంటూ మత్తుమందు ఇచ్చి యువతిపై జిమ్ ట్రైనర్ అమానుషం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

నగ్న చిత్రాలతో బెదిరింపులు.. విజయవాడలో జిమ్ ట్రైనర్ ఘాతుకం.. అసలు ఆ హోటల్‌లో ఏం జరిగింది?

విజయవాడలో దారుణం.. బరువు తగ్గే షేక్ అంటూ మత్తుమందు ఇచ్చి యువతిపై జిమ్ ట్రైనర్ అమానుషం!
విజయవాడలో దారుణం.. బరువు తగ్గే షేక్ అంటూ మత్తుమందు ఇచ్చి యువతిపై జిమ్ ట్రైనర్ అమానుషం!

విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక ఘోర ఉదంతం వెలుగులోకి వచ్చింది. శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం జిమ్ ట్రైనర్‌ను ఆశ్రయించిన ఒక యువతి దారుణ మోసానికి గురైంది. బరువు తగ్గిస్తానంటూ నమ్మబలికిన సదరు ట్రైనర్, ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నమ్మకద్రోహానికి పాల్పడ్డాడు. మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి ఒడిగట్టడమే కాకుండా, నగ్న చిత్రాలు తీసి వేధింపులకు గురిచేసిన ఉదంతం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.

బాధిత యువతి నగరంలో ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. కొంతకాలం క్రితం సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్‌తో పరిచయం ఏర్పడింది. సదరు మహిళ కొంచెం లావుగా ఉండటాన్ని గమనించిన అతడు, స్లిమ్‌గా మార్చేందుకు పలు రకాల జిమ్ సలహాలు ఇస్తూ క్రమంగా పరిచయాన్ని పెంచుకున్నాడు. బరువు తగ్గడానికి తన వద్ద మంచి చిట్కాలు ఉన్నాయంటూ ఆమెను పూర్తిగా నమ్మించాడు.

ఇది కూడా చదవండి: ఓటర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 3 లోపు ఈ చిన్న పని చేయకపోతే మీ ఓటు గల్లంతైనట్లే!

ఈ క్రమంలోనే ఒకరోజు బరువు తగ్గడానికి ప్రత్యేకమైన హెల్త్ షేక్ తాగాలంటూ సదరు యువతిని ఒక ప్రైవేట్ హోటల్‌కు తీసుకువెళ్లాడు. అతడి మాటలను నిజమేనని నమ్మిన ఆమె, అతడు ఇచ్చిన పానీయాన్ని తాగింది. అయితే, ఆ షేక్‌లో అతడు ముందే మత్తుమందు కలిపాడు. అది తాగిన కొద్దిసేపటికే ఆమె స్పృహ కోల్పోయింది. ఆ స్థితిలో ఉన్న యువతిపై అబ్దుల్ ఖాదర్ అత్యంత అమానుషంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెకు సంబంధించిన నగ్న ఫోటోలను తన మొబైల్‌లో రికార్డు చేశాడు.

ఇది కూడా చదవండి: RTC Bus: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు హెచ్చరిక.. ఈ విషయం తెలిస్తే వణికిపోతారు!

స్పృహలోకి వచ్చిన బాధిత మహిళ తనపై జరిగిన దారుణాన్ని తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈ ఘోరంపై ఎవరికైనా చెబితే నగ్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ నిందితుడు ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ ఫోటోలను చూపిస్తూ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేయడం కొనసాగించాడు. నిందితుడి వేధింపులు భరించలేక, చివరకు ధైర్యం చేసిన సదరు ప్రైవేట్ టీచర్ పోలీసులను ఆశ్రయించింది.

జరిగిన దారుణాన్ని వివరిస్తూ ఆమె సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలిని వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఉదంతం వెలుగులోకి రాగానే నిందితుడు అబ్దుల్ ఖాదర్ పరారయ్యాడు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితుడు ఎక్కడున్నా త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 July 2026, 9:43 am Digital Edition : Prabhanews
విజయవాడలో దారుణం.. బరువు తగ్గే షేక్ అంటూ మత్తుమందు ఇచ్చి యువతిపై జిమ్ ట్రైనర్ అమానుషం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 20, 2026 4:48 PM ISTనగ్న చిత్రాలతో బెదిరింపులు.. విజయవాడలో జిమ్ ట్రైనర్ ఘాతుకం.. అసలు ఆ హోటల్‌లో ఏం జరిగింది?విజయవాడలో దారుణం.. బరువు తగ్గే షేక్ అంటూ మత్తుమందు ఇచ్చి యువతిపై జిమ్ ట్రైనర్ అమానుషం!విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక ఘోర ఉదంతం వెలుగులోకి వచ్చింది. శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం జిమ్ ట్రైనర్‌ను ఆశ్రయించిన ఒక యువతి దారుణ మోసానికి గురైంది. బరువు తగ్గిస్తానంటూ నమ్మబలికిన సదరు ట్రైనర్, ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నమ్మకద్రోహానికి పాల్పడ్డాడు. మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి ఒడిగట్టడమే కాకుండా, నగ్న చిత్రాలు తీసి వేధింపులకు గురిచేసిన ఉదంతం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.బాధిత యువతి నగరంలో ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. కొంతకాలం క్రితం సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్‌తో పరిచయం ఏర్పడింది. సదరు మహిళ కొంచెం లావుగా ఉండటాన్ని గమనించిన అతడు, స్లిమ్‌గా మార్చేందుకు పలు రకాల జిమ్ సలహాలు ఇస్తూ క్రమంగా పరిచయాన్ని పెంచుకున్నాడు. బరువు తగ్గడానికి తన వద్ద మంచి చిట్కాలు ఉన్నాయంటూ ఆమెను పూర్తిగా నమ్మించాడు.ఇది కూడా చదవండి: ఓటర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 3 లోపు ఈ చిన్న పని చేయకపోతే మీ ఓటు గల్లంతైనట్లే!ఈ క్రమంలోనే ఒకరోజు బరువు తగ్గడానికి ప్రత్యేకమైన హెల్త్ షేక్ తాగాలంటూ సదరు యువతిని ఒక ప్రైవేట్ హోటల్‌కు తీసుకువెళ్లాడు. అతడి మాటలను నిజమేనని నమ్మిన ఆమె, అతడు ఇచ్చిన పానీయాన్ని తాగింది. అయితే, ఆ షేక్‌లో అతడు ముందే మత్తుమందు కలిపాడు. అది తాగిన కొద్దిసేపటికే ఆమె స్పృహ కోల్పోయింది. ఆ స్థితిలో ఉన్న యువతిపై అబ్దుల్ ఖాదర్ అత్యంత అమానుషంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెకు సంబంధించిన నగ్న ఫోటోలను తన మొబైల్‌లో రికార్డు చేశాడు.ఇది కూడా చదవండి: RTC Bus: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు హెచ్చరిక.. ఈ విషయం తెలిస్తే వణికిపోతారు!స్పృహలోకి వచ్చిన బాధిత మహిళ తనపై జరిగిన దారుణాన్ని తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈ ఘోరంపై ఎవరికైనా చెబితే నగ్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ నిందితుడు ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ ఫోటోలను చూపిస్తూ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేయడం కొనసాగించాడు. నిందితుడి వేధింపులు భరించలేక, చివరకు ధైర్యం చేసిన సదరు ప్రైవేట్ టీచర్ పోలీసులను ఆశ్రయించింది.జరిగిన దారుణాన్ని వివరిస్తూ ఆమె సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలిని వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఉదంతం వెలుగులోకి రాగానే నిందితుడు అబ్దుల్ ఖాదర్ పరారయ్యాడు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితుడు ఎక్కడున్నా త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.Location :Vijayawada,Krishna,Andhra Pradeshమరింత చదవండి

Source link