హైదరాబాద్ బేగంపేట వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, జూలై 20 నుంచి 27 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. మొదటి రోజు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. భారీ వర్షాల హెచ్చరిక ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

