ప్రభన్యూస్

Petrol Diesel Price Today: మళ్లీ పెరిగిన క్రూడ్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవే! | బిజినెస్


Last Updated:

Petrol Price Today: మధ్య ఆసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం రద్దయ్యింది. ప్రతీకారం అంటూ ఇరాన్.. శాంతి కోసం అంటూ అమెరికా పరస్పర దాడులు మొదలు పెట్టాయి. క్రూడ్ ధరలు పెరగడం మొదలయ్యాయి. ఈ క్రమంలో సోమవారం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం

ఫైల్ ఫోటో
ఫైల్ ఫోటో

Petrol Diesel Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరలు ఒడిదొడుకులకు లోనవుతున్నప్పటికీ, తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నేడు (జూలై 13) పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (HPCL, IOCL, BPCL) నేటి ఇంధన ధరల పట్టికను విడుదల చేశాయి. ప్రధాన నగరాల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో వాహనదారులకు రేట్ల పరంగా ఊరట లభించింది.

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం రద్దు కావడం.. ప్రస్తుతం ఆ రెండు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటుండటంతో క్రూడ్ ఆయిల్ ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. గ్లోబల్ మార్కెట్‌లో 70 డాలర్ల వద్ద ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం 78 డాలర్ల వద్ద కొనసాగుతుంది. మధ్యాసియాలో ఉద్రిక్త పరిస్థితిలు కొనసాగడమూ లేదంటే హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేయడమూ జరిగితే క్రూడ్ ధరలు మళ్లీ 100కు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగేతే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోగా మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయి.

తెలంగాణలో..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించిన తాజా ధరల ప్రకారం, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.69 గా ఉంది. నిత్యావసర రవాణాకు కీలకమైన లీటర్ డీజిల్ ధర ఇక్కడ రూ. 103.82 వద్ద కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో మాత్రం స్థానిక పన్నులు, రవాణా వ్యయాలు, డీలర్ కమిషన్ వంటి అంశాల ప్రభావంతో స్వల్పంగా ధరల్లో తేడాలు కనిపించవచ్చు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధరల పెరుగుదల లేదా తగ్గుదల మాత్రం నమోదు కాలేదు.

ఏపీలో..

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టీఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈరోజు పెద్దగా వ్యత్యాసాలు కనిపించలేదు. విజయవాడలో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.117.25గా కొనసాగుతోంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.104.96గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా పేరొందిన విశాఖపట్నం (వైజాగ్) లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే ఇంధన ధరలు ఇలా ఉన్నాయి. విశాఖ తీరంలో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర రూ. 116.39 వద్ద విక్రయమవుతోంది. ఇక్కడ లీటర్ డీజిల్ ధర రూ. 104.11గా స్థిరంగా ఉంది.

మీ నగరంలోని ఇండియన్ ఆయిల్ బంకుల్లో అమలులో ఉన్న తాజా ధరలను మొబైల్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం RSP <స్పేస్> డీలర్ కోడ్ టైప్ చేసి 92249 92249 నంబర్‌కు SMS పంపాలి. హైదరాబాద్‌కు 134483, విజయవాడకు 127611, విశాఖపట్నానికి 127290 డీలర్ కోడ్‌లను ఉపయోగించాలి. వెంటనే మీ ప్రాంతంలోని లైవ్ పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు మీ మొబైల్‌కు సందేశంగా అందుతాయి. దీంతో ప్రతి రోజు ఇంధన ధరలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 July 2026, 8:54 am Digital Edition : Prabhanews
Petrol Diesel Price Today: మళ్లీ పెరిగిన క్రూడ్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవే! | బిజినెస్

Last Updated:Jul 21, 2026 7:17 AM ISTPetrol Price Today: మధ్య ఆసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం రద్దయ్యింది. ప్రతీకారం అంటూ ఇరాన్.. శాంతి కోసం అంటూ అమెరికా పరస్పర దాడులు మొదలు పెట్టాయి. క్రూడ్ ధరలు పెరగడం మొదలయ్యాయి. ఈ క్రమంలో సోమవారం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాంఫైల్ ఫోటోPetrol Diesel Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరలు ఒడిదొడుకులకు లోనవుతున్నప్పటికీ, తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నేడు (జూలై 13) పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (HPCL, IOCL, BPCL) నేటి ఇంధన ధరల పట్టికను విడుదల చేశాయి. ప్రధాన నగరాల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో వాహనదారులకు రేట్ల పరంగా ఊరట లభించింది.అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం రద్దు కావడం.. ప్రస్తుతం ఆ రెండు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటుండటంతో క్రూడ్ ఆయిల్ ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. గ్లోబల్ మార్కెట్‌లో 70 డాలర్ల వద్ద ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం 78 డాలర్ల వద్ద కొనసాగుతుంది. మధ్యాసియాలో ఉద్రిక్త పరిస్థితిలు కొనసాగడమూ లేదంటే హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేయడమూ జరిగితే క్రూడ్ ధరలు మళ్లీ 100కు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగేతే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోగా మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయి.తెలంగాణలో..ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించిన తాజా ధరల ప్రకారం, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.69 గా ఉంది. నిత్యావసర రవాణాకు కీలకమైన లీటర్ డీజిల్ ధర ఇక్కడ రూ. 103.82 వద్ద కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో మాత్రం స్థానిక పన్నులు, రవాణా వ్యయాలు, డీలర్ కమిషన్ వంటి అంశాల ప్రభావంతో స్వల్పంగా ధరల్లో తేడాలు కనిపించవచ్చు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధరల పెరుగుదల లేదా తగ్గుదల మాత్రం నమోదు కాలేదు.ఏపీలో..ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టీఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈరోజు పెద్దగా వ్యత్యాసాలు కనిపించలేదు. విజయవాడలో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.117.25గా కొనసాగుతోంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.104.96గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా పేరొందిన విశాఖపట్నం (వైజాగ్) లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే ఇంధన ధరలు ఇలా ఉన్నాయి. విశాఖ తీరంలో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర రూ. 116.39 వద్ద విక్రయమవుతోంది. ఇక్కడ లీటర్ డీజిల్ ధర రూ. 104.11గా స్థిరంగా ఉంది.మీ నగరంలోని ఇండియన్ ఆయిల్ బంకుల్లో అమలులో ఉన్న తాజా ధరలను మొబైల్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం RSP <స్పేస్> డీలర్ కోడ్ టైప్ చేసి 92249 92249 నంబర్‌కు SMS పంపాలి. హైదరాబాద్‌కు 134483, విజయవాడకు 127611, విశాఖపట్నానికి 127290 డీలర్ కోడ్‌లను ఉపయోగించాలి. వెంటనే మీ ప్రాంతంలోని లైవ్ పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు మీ మొబైల్‌కు సందేశంగా అందుతాయి. దీంతో ప్రతి రోజు ఇంధన ధరలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link