ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో ఓ పేద కుటుంబంలో వడ్లపాటి విజయలక్ష్మిగా జన్మించిన ఆమె.. సినిమాల్లో అవకాశాల కోసం చెన్నై చేరారు. మొదట మేకప్ అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించి, తమిళ చిత్రం ‘వండిచక్కరం’ (1979)తో సిల్క్ స్మితగా మారారు. అప్పటి నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 450కి పైగా చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు.

