వర్షాకాలం వచ్చిందంటే ఇంట్లో బట్టలు ఆరడం పెద్ద సవాలుగా మారుతుంది. వాతావరణంలో తేమ (హ్యూమిడిటీ) ఎక్కువగా ఉండటం, సూర్యరశ్మి తగ్గిపోవడం వల్ల ఉతికిన బట్టలు గంటల తరబడి తడిగానే ఉంటాయి. ఈ తేమ కారణంగా బట్టల్లో బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి బట్టలను ధరించడం వల్ల చర్మవ్యాధులు, దురద, దద్దుర్లు, అలర్జీలు, ప్రైవేట్ భాగాల్లో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని చర్మవ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు.

