Last Updated:
రామ్ చరణ్, సుక్కుల కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా అని ఒక్క మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ ఇండియన్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
రామ్ చరణ్, సుక్కుల కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా అని ఒక్క మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ ఇండియన్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రీ లుక్ పోస్టర్ మాములు అంచనాలు క్రియేట్ చేయలేదు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కాగా తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్‌డేట్ బయకు వచ్చింది.

అదేంటంటే… ఈ మూవీలో యాక్టింగ్ చేసే ఛాన్స్ ఇస్తున్నట్లు క్యాస్టింగ్ కాల్ గురించి ప్రకటించారు. ఎవరికైనా యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు తమ ఫొటోలు, యాక్టింగ్‌కు సంబంధించిన వివరాలతో కూడిన పోర్ట్‌ఫోలియోను src17casting@gmail.com అనే ఈమెయిల్ అడ్రస్‌కు పంపించాలి. అలాగే 9110564651 అనే వాట్సాప్ నంబర్‌కు కూడా తమ వివరాలను పంపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ నంబర్‌కు కేవలం టెక్స్ట్ మెసేజ్‌లు మాత్రమే పంపించాలని పోస్టర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఫోన్ కాల్స్ చేయవద్దని, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పంపించవద్దని సూచించారు.
A new world. A new story. And maybe, a role that’s waiting for YOU ❤️🔥
The casting doors are now open for #RC17 🎯We’re looking for actors across age groups to be a part of this exciting cinematic journey.
Send in your auditions to src17casting@gmail.com
📲 WhatsApp: 9110564651#YouCanImagine #RC2Sukku #SRC
Mega Power Star @AlwaysRamCharan Master Storyteller @aryasukku @MythriOfficial @SukumarWritings #TSeriesFilms @RC17Offl
— Mythri Movie Makers (@MythriOfficial) November 27, 2026
ఆడిషన్స్‌కు సంబంధించిన టైమ్‌ను కూడా పోస్టర్‌లో వెల్లడించారు. మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆడిషన్స్ జరిగే డేట్, ప్లేస్ వంటి పూర్తి వివరాలు ఇంకా చెప్పలేరు. ఆసక్తి ఉన్నవాళ్లు ముందుగా ఇచ్చిన ఈమెయిల్ లేదంటే వాట్సాప్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.
అంతేకాదు.. 16 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నవాళ్లు ఎవరైనా ఈ ఆడిషన్స్‌లో పాల్గొనవచ్చు. మొత్తానికి.. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న RC17 సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ క్యాస్టింగ్ కాల్ ఆసక్తికరమైన వార్త. 16 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మేల్, ఫీ మేల్స్‌కు తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకునేందుకు ఇదొక మంచి ఛాన్స్.
ప్రస్తుతం ఈ సినిమాను ‘RC17’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నాడు. మరోవైపు హీరోయిన్‌గా ఆకాశంలో ఒకతార బ్యూటీ సాత్విక వీరవల్లిని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

