Last Updated:
శర్వానంద్ హీరోగా, దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన పీరియడ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ భారీ అంచనాల నడుమ నేడు అనగా నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ టాక్ అయితే బయటకొచ్చింది.
శర్వానంద్ హీరోగా, దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన పీరియడ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ భారీ అంచనాల నడుమ నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించారు. 1960ల కాలంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ‘బొగ్గులగుట్ట’ అనే కాల్పనిక గ్రామంలో జరిగే కథతో ఈ సినిమా రూపొందింది. ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా ‘గంగ’ అనే పవర్ఫుల్ పాత్రలో శర్వానంద్ నటించగా, అమావాస్య చుట్టూ తిరిగే మూఢనమ్మకాలు, భూస్వాముల అకృత్యాలపై అతడు చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధాన కథ.
సుమారు 15 ఎకరాల్లో ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె నిర్మించిన గ్రామీణ సెట్, కిషోర్ కుమార్ ఏ సినిమాటోగ్రఫీ, భీమ్స్ సిసిరోలియో సంగీతం, దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కొరియోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ మరియు ఆయేషా మారియం కాస్ట్యూమ్స్ ఈ చిత్రానికి సాంకేతిక బలాన్ని అందించాయి. తీవ్రమైన హింస, రక్తపాతం నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఈ 2 గంటల 34 నిమిషాల చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది.
Reviews chusthunte first show ke #Bhogi loki kalipese range vunnayee
— Arun Kumar 🦚 (@ArunKumar09_) November 27, 2026
#Bhogi Review – “A Pale Imitation of Rangasthalam That Tests Your Patience!”
👉 Rating: 1.5/5 ⭐Positives: 👉 Decent first half! 👉 Promising premise!
Negatives: 👉 Rehashed storyline & outdated screenplay! 👉 Overpowering background score! 👉 Excessive violence & lengthy action sequences! 👉 Tedious second half! 👉 Painfully stretched climax!
— PaniPuri (@THEPANIPURI) November 27, 2026
ఇప్పటికే ప్రీమియర్ షోలు, మార్నింగ్ షోలు పూర్తికావడంతో ఈ సినిమా ఎలా ఉందనే దానిపై ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవుతున్నారు. వీటిని బట్టి చూస్తే ఇప్పటికైతే ‘భోగి’కి పాజిటివ్ స్పందన అయితే రాలేదు. రస్టిక్ మాస్ లుక్‌లో శర్వానంద్ చూపిన నటన, యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ ట్విస్ట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయని టాక్ వినిపిస్తోంది.
అయితే, గ్రామం, విలన్, రివెంజ్ చుట్టూ తిరిగే కథనం ‘రంగస్థలం’ సినిమాను గుర్తుచేస్తూ ఊహించదగిన రొటీన్ ఫార్ములాలో సాగిందని పలువురు విమర్శిస్తున్నారు. నెమ్మదిగా సాగే ఫస్టాఫ్, హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత తగ్గడం, ఆకట్టుకునే పాటలు లేకపోవడం, లౌడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మైనస్ అంటున్నారు. ముఖ్యంగా అతి రక్తపాతం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడే అవకాశం ఉందని, యాక్షన్ ఉన్నప్పటికీ సెకండాఫ్ ఉత్కంఠను రేకెత్తించలేకపోయిందని చెబుతున్నారు.
శర్వానంద్ మేకోవర్, పవర్ఫుల్ మాస్ నటన, క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రమే ఈ సినిమా ప్లస్ పాయింట్స్ అని చెబుతున్నారు. కొత్తదనం లేని పాత ఫార్ములా కథనం థియేటర్స్ లో సహనానికి పరీక్ష అని కొందరు అంటున్నారు. మొత్తంగా చెప్పాలంటే, కొత్తదనం ఆశించే ప్రేక్షకులను కాస్త నిరాశపరిచినప్పటికీ, పక్కా మాస్ యాక్షన్ మరియు రివెంజ్ డ్రామాలను ఇష్టపడే వారికి శర్వానంద్ నటన కోసం ‘భోగి’ ఒకసారి చూడదగిన చిత్రంగా నిలుస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

