ప్రభన్యూస్

Petrol News: పెట్రోల్‌లో మరో మార్పునకు కేంద్రం ప్లాన్.. E25 అమలుపై కీలక ప్రకటన! | బిజినెస్


Last Updated:

E20 Petrol Latest News: ఇకపై మీ బైక్, కారులో వేసే పెట్రోల్ మారనుందా? ప్రస్తుతం 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని 25 శాతానికి పెంచే అంశంపై కేంద్ర మంత్రి తాజాగా స్పందించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

పెట్రోల్ వాహనాలు వినియోగించే వారికి బిగ్ అలర్ట్. ప్రస్తుతం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలుపుతున్న కేంద్రం.. భవిష్యత్తులో ఈ పరిమాణాన్ని మరింత పెంచే అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే ఎలాంటి ముందస్తు పరీక్షలు లేకుండా నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేసింది. వాహనాల పనితీరు, ఇంధన నాణ్యత, పర్యావరణంపై ప్రభావం వంటి అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తదుపరి అడుగు వేస్తామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దేవి అహల్య విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. 2030 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని భారత్ నిర్ణీత గడువు కంటే ముందుగానే సాధించిందని చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న E20 విధానాన్ని మించి వెళ్లేందుకు సమగ్ర పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. అవసరమైన సాంకేతిక, పారిశ్రామిక వ్యవస్థ సిద్ధమైన తర్వాతే E25 లేదా అంతకంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమం గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు.

ఇథనాల్ కలపడం వల్ల దేశానికి ఎంత లాభం?

పెట్రోల్‌లో ఇథనాల్ కలపడంపై కొంతమంది వాహనదారుల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ, ఈ విధానం దేశానికి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చిందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు ఇథనాల్ మిశ్రమం వల్ల సుమారు రూ.1.90 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని చెప్పారు. ఇందులో దాదాపు రూ.1.40 లక్షల కోట్లు రైతులకు చేరాయని వివరించారు. ఇథనాల్ తయారీకి వ్యవసాయ ఉత్పత్తులు ఉపయోగపడటంతో రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు పెట్రోల్ దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడంలోనూ ఈ విధానం ఉపయోగపడుతోంది.

LPG నుంచి PNGకి మారాలని సూచన..

దేశంలో వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఎలాంటి కొరత లేదని హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. అయితే ప్రజలు క్రమంగా LPG సిలిండర్ల నుంచి పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువు (PNG) వైపు మారాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. PNG ఇంధనం మరింత స్వచ్ఛమైనది, పొదుపుతో కూడుకున్నది, వినియోగానికి అనుకూలమైనదని వివరించారు. నగరాల్లో పైపుల ద్వారా గ్యాస్ సరఫరా వ్యవస్థను విస్తరించడం కూడా ఈ ప్రయత్నంలో భాగంగా ఉంది.

పెట్రోల్ ధరలు తగ్గుతాయా?

పెట్రోల్ ధరల విషయంలో ప్రతిపక్షాలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని మంత్రి విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం పెట్రోల్ సరఫరాకు కొరత లేదని, పరిస్థితులను బట్టి ధరలు తగ్గే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. అయితే పెట్రోల్ ధరలు ఒక్క అంశంపై ఆధారపడి ఉండవని వివరించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, రవాణా ఖర్చులు, రిఫైనింగ్ మార్జిన్లు, డీలర్ కమిషన్లు వంటి అనేక అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయని చెప్పారు. పెట్రోల్ ధరలను వెంటనే పెంచడం లేదా తగ్గించడం ప్రభుత్వానికి సులభమైన విషయం కాదని ఆయన చమత్కరించారు. ధరలను మార్చేందుకు ఎవరి దగ్గరైనా మంత్రదండం ఉన్నట్లు చెప్పడం వాస్తవం కాదని, తాను ఐదేళ్లుగా అలాంటి మంత్రదండం కోసం వెతుకుతున్నా దొరకలేదని వ్యాఖ్యానించారు.

ఎప్‌స్టీన్ ఆరోపణలపై స్పందన..

ఇదిలా ఉండగా, అమెరికాకు చెందిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను పూరి ఖండించారు. ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం లేవనెత్తుతున్నారని విమర్శించారు. అప్పట్లో తాను ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా లేనని, న్యూయార్క్‌లో నివసిస్తున్న ప్రైవేట్ పౌరుడినని గతంలోనే స్పష్టం చేసినట్లు తెలిపారు. న్యూయార్క్‌లో ఉన్న సమయంలో పలువురు ప్రముఖులను కలవడం సాధారణమేనని చెప్పారు. మరోవైపు, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మధ్య మళ్లీ పొత్తు కుదిరే అవకాశాలపై కూడా ఆయన స్పందించారు. ఈ రెండు పార్టీల మధ్య కూటమి ఏర్పడితే పంజాబ్‌తో పాటు దేశానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 November 2026, 7:37 am Digital Edition : Prabhanews
Petrol News: పెట్రోల్‌లో మరో మార్పునకు కేంద్రం ప్లాన్.. E25 అమలుపై కీలక ప్రకటన! | బిజినెస్

Last Updated:November 27, 2026 7:29 AM ISTE20 Petrol Latest News: ఇకపై మీ బైక్, కారులో వేసే పెట్రోల్ మారనుందా? ప్రస్తుతం 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని 25 శాతానికి పెంచే అంశంపై కేంద్ర మంత్రి తాజాగా స్పందించారు.
ప్రతీకాత్మక చిత్రంపెట్రోల్ వాహనాలు వినియోగించే వారికి బిగ్ అలర్ట్. ప్రస్తుతం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలుపుతున్న కేంద్రం.. భవిష్యత్తులో ఈ పరిమాణాన్ని మరింత పెంచే అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే ఎలాంటి ముందస్తు పరీక్షలు లేకుండా నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేసింది. వాహనాల పనితీరు, ఇంధన నాణ్యత, పర్యావరణంపై ప్రభావం వంటి అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తదుపరి అడుగు వేస్తామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దేవి అహల్య విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. 2030 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని భారత్ నిర్ణీత గడువు కంటే ముందుగానే సాధించిందని చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న E20 విధానాన్ని మించి వెళ్లేందుకు సమగ్ర పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. అవసరమైన సాంకేతిక, పారిశ్రామిక వ్యవస్థ సిద్ధమైన తర్వాతే E25 లేదా అంతకంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమం గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు.ఇథనాల్ కలపడం వల్ల దేశానికి ఎంత లాభం?పెట్రోల్‌లో ఇథనాల్ కలపడంపై కొంతమంది వాహనదారుల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ, ఈ విధానం దేశానికి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చిందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు ఇథనాల్ మిశ్రమం వల్ల సుమారు రూ.1.90 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని చెప్పారు. ఇందులో దాదాపు రూ.1.40 లక్షల కోట్లు రైతులకు చేరాయని వివరించారు. ఇథనాల్ తయారీకి వ్యవసాయ ఉత్పత్తులు ఉపయోగపడటంతో రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు పెట్రోల్ దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడంలోనూ ఈ విధానం ఉపయోగపడుతోంది.LPG నుంచి PNGకి మారాలని సూచన..దేశంలో వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఎలాంటి కొరత లేదని హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. అయితే ప్రజలు క్రమంగా LPG సిలిండర్ల నుంచి పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువు (PNG) వైపు మారాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. PNG ఇంధనం మరింత స్వచ్ఛమైనది, పొదుపుతో కూడుకున్నది, వినియోగానికి అనుకూలమైనదని వివరించారు. నగరాల్లో పైపుల ద్వారా గ్యాస్ సరఫరా వ్యవస్థను విస్తరించడం కూడా ఈ ప్రయత్నంలో భాగంగా ఉంది.పెట్రోల్ ధరలు తగ్గుతాయా?పెట్రోల్ ధరల విషయంలో ప్రతిపక్షాలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని మంత్రి విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం పెట్రోల్ సరఫరాకు కొరత లేదని, పరిస్థితులను బట్టి ధరలు తగ్గే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. అయితే పెట్రోల్ ధరలు ఒక్క అంశంపై ఆధారపడి ఉండవని వివరించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, రవాణా ఖర్చులు, రిఫైనింగ్ మార్జిన్లు, డీలర్ కమిషన్లు వంటి అనేక అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయని చెప్పారు. పెట్రోల్ ధరలను వెంటనే పెంచడం లేదా తగ్గించడం ప్రభుత్వానికి సులభమైన విషయం కాదని ఆయన చమత్కరించారు. ధరలను మార్చేందుకు ఎవరి దగ్గరైనా మంత్రదండం ఉన్నట్లు చెప్పడం వాస్తవం కాదని, తాను ఐదేళ్లుగా అలాంటి మంత్రదండం కోసం వెతుకుతున్నా దొరకలేదని వ్యాఖ్యానించారు.ఎప్‌స్టీన్ ఆరోపణలపై స్పందన..ఇదిలా ఉండగా, అమెరికాకు చెందిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను పూరి ఖండించారు. ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం లేవనెత్తుతున్నారని విమర్శించారు. అప్పట్లో తాను ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా లేనని, న్యూయార్క్‌లో నివసిస్తున్న ప్రైవేట్ పౌరుడినని గతంలోనే స్పష్టం చేసినట్లు తెలిపారు. న్యూయార్క్‌లో ఉన్న సమయంలో పలువురు ప్రముఖులను కలవడం సాధారణమేనని చెప్పారు. మరోవైపు, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మధ్య మళ్లీ పొత్తు కుదిరే అవకాశాలపై కూడా ఆయన స్పందించారు. ఈ రెండు పార్టీల మధ్య కూటమి ఏర్పడితే పంజాబ్‌తో పాటు దేశానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.మరింత చదవండి

Source link