ప్రభన్యూస్

Accident: ఘోర ప్రమాదం.. రోడ్డుపై మృత్యుఘోష.. 31 మంది సజీవదహనం |


Last Updated:

రోడ్డుపై వాహనాలు యథావిధిగా వెళ్తున్నాయి.. అంతలోనే ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. చూస్తుండగానే మంటలు చుట్టుపక్కల వాహనాలను చుట్టుముట్టాయి. ఆకాశమంతా నల్లటి పొగ కమ్ముకుంది. ఈ భయానక ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది గాయపడ్డారు. అసలు ఈ ప్రమాదానికి కారణమేంటి? ట్యాంకర్ ఎలా బోల్తా పడింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

News18
News18

ఈజిప్టు రాజధాని కైరోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెట్రోలియం ఇంధనంతో వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడటంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే కొన్ని తదుపరి నివేదికల్లో మృతుల సంఖ్య 31 నుంచి 33గా ఉండవచ్చని పేర్కొన్నారు. కైరోలోని అల్-వారక్ ప్రాంతంలో రద్దీగా ఉన్న రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వాహనదారులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు.

ఒక్కసారిగా వ్యాపించిన మంటలు

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఇంధన ట్యాంకర్ ప్రయాణిస్తున్న సమయంలో దాని ముందు ఉన్న అధిక వోల్టేజ్ విద్యుత్ తీగ తెగి పడినట్లు తెలుస్తోంది. దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి రహదారి మధ్యలోని డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ట్యాంకర్ బోల్తా పడటంతో మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ట్యాంకర్‌లోని పెట్రోలియం ఇంధనం కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. సమీపంలోని కార్లు, ఇతర వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం 27కు పైగా కార్లు, మోటార్‌సైకిళ్లు దెబ్బతిన్నాయి లేదా పూర్తిగా కాలిపోయాయి.

రంగంలోకి 39 అంబులెన్సులు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు ఆరోగ్యశాఖ ఏకంగా 39 అంబులెన్సులను పంపించింది. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలు, ఆకాశాన్ని కమ్మేసిన నల్లటి పొగ, మంటల్లో చిక్కుకున్న వాహనాలు వీడియోల్లో కనిపించాయి.

మృతుల గుర్తింపునకు డీఎన్ఏ పరీక్షలు

ఈ ప్రమాదానికి గురైన ఇంధన ట్యాంకర్ ప్రైవేటు సంస్థకు చెందినదని ఈజిప్టు పెట్రోలియం మంత్రిత్వశాఖ తెలిపింది. మంటల తీవ్రతకు కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారడంతో బాధితులను గుర్తించేందుకు అధికారులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై ప్రాసిక్యూటర్లు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

బాధిత కుటుంబాలకు అధ్యక్షుడి పరామర్శ

ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు ప్రధాని మోస్తఫా మద్బౌలీ గాయపడిన వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 November 2026, 12:09 pm Digital Edition : Prabhanews
Accident: ఘోర ప్రమాదం.. రోడ్డుపై మృత్యుఘోష.. 31 మంది సజీవదహనం |

Last Updated:November 26, 2026 11:57 AM ISTరోడ్డుపై వాహనాలు యథావిధిగా వెళ్తున్నాయి.. అంతలోనే ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. చూస్తుండగానే మంటలు చుట్టుపక్కల వాహనాలను చుట్టుముట్టాయి. ఆకాశమంతా నల్లటి పొగ కమ్ముకుంది. ఈ భయానక ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది గాయపడ్డారు. అసలు ఈ ప్రమాదానికి కారణమేంటి? ట్యాంకర్ ఎలా బోల్తా పడింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
News18ఈజిప్టు రాజధాని కైరోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెట్రోలియం ఇంధనంతో వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడటంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే కొన్ని తదుపరి నివేదికల్లో మృతుల సంఖ్య 31 నుంచి 33గా ఉండవచ్చని పేర్కొన్నారు. కైరోలోని అల్-వారక్ ప్రాంతంలో రద్దీగా ఉన్న రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వాహనదారులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు.ఒక్కసారిగా వ్యాపించిన మంటలుఅందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఇంధన ట్యాంకర్ ప్రయాణిస్తున్న సమయంలో దాని ముందు ఉన్న అధిక వోల్టేజ్ విద్యుత్ తీగ తెగి పడినట్లు తెలుస్తోంది. దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి రహదారి మధ్యలోని డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ట్యాంకర్ బోల్తా పడటంతో మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ట్యాంకర్‌లోని పెట్రోలియం ఇంధనం కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. సమీపంలోని కార్లు, ఇతర వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం 27కు పైగా కార్లు, మోటార్‌సైకిళ్లు దెబ్బతిన్నాయి లేదా పూర్తిగా కాలిపోయాయి.🇪🇬🚨 DEADLY FUEL TANKER FIRE KILLS AT LEAST 21 ON CAIRO’S RING ROADAt least 21 people have been killed and 15 others injured after a fuel tanker carrying petroleum products overturned and caught fire on Cairo’s Ring Road, above Tunnel 10 in the Al-Warraq district of Giza, Egypt.The fire spread to several nearby vehicles, triggering a massive blaze. Emergency services rushed to the scene, with 39 ambulances deployed to assist victims and transport the injured to nearby hospitals, according to Egypt’s Health Ministry.The casualty figures are preliminary.— Apex Vanguard (@Apex_Intel24) November 25, 2026రంగంలోకి 39 అంబులెన్సులుప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు ఆరోగ్యశాఖ ఏకంగా 39 అంబులెన్సులను పంపించింది. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలు, ఆకాశాన్ని కమ్మేసిన నల్లటి పొగ, మంటల్లో చిక్కుకున్న వాహనాలు వీడియోల్లో కనిపించాయి.మృతుల గుర్తింపునకు డీఎన్ఏ పరీక్షలుఈ ప్రమాదానికి గురైన ఇంధన ట్యాంకర్ ప్రైవేటు సంస్థకు చెందినదని ఈజిప్టు పెట్రోలియం మంత్రిత్వశాఖ తెలిపింది. మంటల తీవ్రతకు కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారడంతో బాధితులను గుర్తించేందుకు అధికారులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై ప్రాసిక్యూటర్లు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.బాధిత కుటుంబాలకు అధ్యక్షుడి పరామర్శఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు ప్రధాని మోస్తఫా మద్బౌలీ గాయపడిన వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టింది.మరింత చదవండి

Source link