Packaged Drinking Water: బిస్లెరీ ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా వాటర్ బాటిళ్లను పరీక్షించనున్న FSSAI! | బిజినెస్


Last Updated:

Packaged Drinking Water: మీరు రోజూ వాటర్ బాటిల్ కొనుగోలు చేసి తాగుతున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. బిస్లెరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాల్లో నిబంధనలకు విరుద్ధంగా రసాయనాల అవశేషాలు గుర్తించడంతో FSSAI చర్యలకు దిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇతర కంపెనీల వాటర్ బాటిళ్ల నమూనాలను కూడా పరీక్షిస్తోంది.

News18
News18

బిస్లెరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌లో రసాయనాల అవశేషాలు ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలడంతో FSSAI నోటీసులు, ప్రాసిక్యూషన్ చర్యలకు దిగింది. ఈ ఒక్కదెబ్బతో దేశవ్యాప్తంగా ప్యాకేజ్డ్ వాటర్ నాణ్యతపై చర్చ మొదలైంది. దీంతో మార్కెట్లో విక్రయించే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఎంతవరకు సురక్షితం? వాటిలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా? ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి అంశాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలకు చెందిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపిస్తోంది. ఈ పరీక్షల ప్రక్రియ పూర్తవడానికి కనీసం ఒకటి నుంచి రెండు నెలల సమయం పట్టవచ్చని FSSAI సీఈఓ రజిత్ పున్హాని వెల్లడించారు.

బిస్లెరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనా ల్యాబ్ పరీక్షల్లో నిబంధనలకు అనుగుణంగా లేదని తేలిన నేపథ్యంలో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఒక్క బిస్లెరీ కంపెనీకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ప్యాకేజ్డ్ వాటర్ తయారీ, విక్రయ సంస్థలపై తనిఖీలను విస్తరించింది. ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్న ప్రధాన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల (FBOs) ప్రాంగణాలను అధికారులు తనిఖీ చేసి నమూనాలను సేకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ తనిఖీల వెనుక ప్రత్యేక కారణం ఏమీ లేదని రజిత్ పున్హాని స్పష్టం చేశారు. వినియోగదారులకు సురక్షితమైన ఆహార ఉత్పత్తులు అందించేందుకు FSSAI చేపడుతున్న సాధారణ తనిఖీల్లో నీరు కూడా ఒక భాగమని వివరించారు. గత ఏడాది పాలు, మాంసం, గుడ్లు, తృణధాన్యాలు, ఎనర్జీ డ్రింక్స్, చక్కెర పానీయాల నాణ్యతపై పరిశీలనలు చేపట్టామని, ఇప్పుడు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌పై దృష్టి పెట్టామని చెప్పారు.

ఇదే సమయంలో ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించే మెటీరియల్‌పైనా FSSAI ప్రత్యేక తనిఖీలు చేపట్టనుంది. ఈ ప్యాకేజింగ్ వస్తువులు తప్పనిసరిగా ఫుడ్ గ్రేడ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే తప్పుడు ప్రకటనలు, ఆహార ఉత్పత్తుల లేబుళ్లపై తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచురించే సంస్థలపైనా చర్యలు తీసుకుంటున్నట్లు పున్హాని తెలిపారు.

ఇవి కూడా చదవండి: LPG Cylinder: డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. గ్యాస్ ధరలు, బ్యాంకు వడ్డీ రేట్లపై కీలక అప్‌డేట్!

ఇక బిస్లెరీ విషయానికి వస్తే.. కంపెనీ ప్రాంగణం నుంచి సేకరించిన ‘ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (మినరల్ వాటర్ కాకుండా)’ నమూనాలో బ్రోమేట్ పరిమితులు నిబంధనలకు అనుగుణంగా లేవని ప్రాథమిక పరీక్షల్లో గుర్తించారు. దీంతో FSSAI ఆ నమూనాను సురక్షితం కాదని ప్రకటించింది. కంపెనీ విజ్ఞప్తి మేరకు మరోసారి పరీక్షించగా, పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) గుర్తించినట్లు రెఫరల్ ల్యాబొరేటరీ నివేదించింది. ఈ ఫలితాల ఆధారంగా ఆహార భద్రత చట్టం ప్రకారం ఉల్లంఘనలు జరిగినట్లు FSSAI పేర్కొంది. బిస్లెరీ ఇంటర్నేషనల్‌పై ప్రాసిక్యూషన్‌కు కూడా అనుమతి ఇచ్చింది.

అయితే, తమ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వినియోగానికి సురక్షితమేనని బిస్లెరీ ఇంటర్నేషనల్ సోమవారం ప్రకటించింది. ఈ సమస్య పరిష్కారానికి ఫుడ్ రెగ్యులేటర్‌తో కలిసి పనిచేస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పరీక్షల్లో ఇతర కంపెనీల నమూనాల ఫలితాలు ఎలా ఉంటాయో తెలియాలంటే మరో ఒకటి రెండు నెలలు వేచి చూడాల్సి ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 November 2026, 2:41 pm Digital Edition : Prabhanews
Packaged Drinking Water: బిస్లెరీ ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా వాటర్ బాటిళ్లను పరీక్షించనున్న FSSAI! | బిజినెస్

Last Updated:November 25, 2026 2:33 PM ISTPackaged Drinking Water: మీరు రోజూ వాటర్ బాటిల్ కొనుగోలు చేసి తాగుతున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. బిస్లెరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాల్లో నిబంధనలకు విరుద్ధంగా రసాయనాల అవశేషాలు గుర్తించడంతో FSSAI చర్యలకు దిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇతర కంపెనీల వాటర్ బాటిళ్ల నమూనాలను కూడా పరీక్షిస్తోంది.
News18బిస్లెరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌లో రసాయనాల అవశేషాలు ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలడంతో FSSAI నోటీసులు, ప్రాసిక్యూషన్ చర్యలకు దిగింది. ఈ ఒక్కదెబ్బతో దేశవ్యాప్తంగా ప్యాకేజ్డ్ వాటర్ నాణ్యతపై చర్చ మొదలైంది. దీంతో మార్కెట్లో విక్రయించే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఎంతవరకు సురక్షితం? వాటిలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా? ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి అంశాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలకు చెందిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపిస్తోంది. ఈ పరీక్షల ప్రక్రియ పూర్తవడానికి కనీసం ఒకటి నుంచి రెండు నెలల సమయం పట్టవచ్చని FSSAI సీఈఓ రజిత్ పున్హాని వెల్లడించారు.బిస్లెరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనా ల్యాబ్ పరీక్షల్లో నిబంధనలకు అనుగుణంగా లేదని తేలిన నేపథ్యంలో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఒక్క బిస్లెరీ కంపెనీకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ప్యాకేజ్డ్ వాటర్ తయారీ, విక్రయ సంస్థలపై తనిఖీలను విస్తరించింది. ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్న ప్రధాన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల (FBOs) ప్రాంగణాలను అధికారులు తనిఖీ చేసి నమూనాలను సేకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఈ తనిఖీల వెనుక ప్రత్యేక కారణం ఏమీ లేదని రజిత్ పున్హాని స్పష్టం చేశారు. వినియోగదారులకు సురక్షితమైన ఆహార ఉత్పత్తులు అందించేందుకు FSSAI చేపడుతున్న సాధారణ తనిఖీల్లో నీరు కూడా ఒక భాగమని వివరించారు. గత ఏడాది పాలు, మాంసం, గుడ్లు, తృణధాన్యాలు, ఎనర్జీ డ్రింక్స్, చక్కెర పానీయాల నాణ్యతపై పరిశీలనలు చేపట్టామని, ఇప్పుడు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌పై దృష్టి పెట్టామని చెప్పారు.ఇదే సమయంలో ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించే మెటీరియల్‌పైనా FSSAI ప్రత్యేక తనిఖీలు చేపట్టనుంది. ఈ ప్యాకేజింగ్ వస్తువులు తప్పనిసరిగా ఫుడ్ గ్రేడ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే తప్పుడు ప్రకటనలు, ఆహార ఉత్పత్తుల లేబుళ్లపై తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచురించే సంస్థలపైనా చర్యలు తీసుకుంటున్నట్లు పున్హాని తెలిపారు.ఇవి కూడా చదవండి: LPG Cylinder: డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. గ్యాస్ ధరలు, బ్యాంకు వడ్డీ రేట్లపై కీలక అప్‌డేట్!ఇక బిస్లెరీ విషయానికి వస్తే.. కంపెనీ ప్రాంగణం నుంచి సేకరించిన 'ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (మినరల్ వాటర్ కాకుండా)' నమూనాలో బ్రోమేట్ పరిమితులు నిబంధనలకు అనుగుణంగా లేవని ప్రాథమిక పరీక్షల్లో గుర్తించారు. దీంతో FSSAI ఆ నమూనాను సురక్షితం కాదని ప్రకటించింది. కంపెనీ విజ్ఞప్తి మేరకు మరోసారి పరీక్షించగా, పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) గుర్తించినట్లు రెఫరల్ ల్యాబొరేటరీ నివేదించింది. ఈ ఫలితాల ఆధారంగా ఆహార భద్రత చట్టం ప్రకారం ఉల్లంఘనలు జరిగినట్లు FSSAI పేర్కొంది. బిస్లెరీ ఇంటర్నేషనల్‌పై ప్రాసిక్యూషన్‌కు కూడా అనుమతి ఇచ్చింది.అయితే, తమ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వినియోగానికి సురక్షితమేనని బిస్లెరీ ఇంటర్నేషనల్ సోమవారం ప్రకటించింది. ఈ సమస్య పరిష్కారానికి ఫుడ్ రెగ్యులేటర్‌తో కలిసి పనిచేస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పరీక్షల్లో ఇతర కంపెనీల నమూనాల ఫలితాలు ఎలా ఉంటాయో తెలియాలంటే మరో ఒకటి రెండు నెలలు వేచి చూడాల్సి ఉంటుంది.మరింత చదవండి

Source link