ఇక శోభన్‌కు ఇద్దరు కొడుకులు. వీరిద్దరు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. ఒకరు సంతోష్ శోభన్ కాగా.. మరొకరు సంగీత్ శోభన్. గోల్కొండ హై స్కూల్ సినిమాతో ఈ ఇద్దరు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. పేపర్ బాయ్, ఏక్ మినీకథ, కళ్యాణం కమనీయం, కపుల్ ఫ్రెండ్లీ.. ఇలా బాయ్ నెక్స్ట్ డోర్ సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక సంగీత్ శోభన్ కూడా.. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, రాకాస వంటి సినిమాలతో హీరోగా నిలదొక్కుకుంటున్నాడు.

