ప్రభన్యూస్

కావ్య మారన్-అనిరుధ్ గ్రాండ్ రిసెప్షన్.. వేడుకలో మెరిసిన సీఎంలు రేవంత్, విజయ్! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

చెన్నైలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ-యజమాని కావ్య మారన్, సంగీత దర్శకుడు అనిరుధ్ వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం విజయ్, రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

News18
News18

సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ-యజమాని, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్ చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. నవంబర్ 11న గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న ఈ జంట, శనివారం చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఎరుపు రంగు ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ దుస్తుల్లో కావ్య మెరిసిపోగా, ఎరుపు, నలుపు, సిల్వర్ డిజైన్ జాకెట్‌తో అనిరుధ్ అందరి దృష్టిని ఆకర్షించారు.

సినిమా, క్రికెట్, రాజకీయ రంగాల దిగ్గజాలతో ఈ వేడుక తారాలోకాన్ని తలపించింది. అనిరుధ్ మేనమామ, సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ స్టైలిష్ బ్లూ ఇండో-వెస్టర్న్ సూట్‌లో విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్, నటుడు కమల్ హాసన్ కూడా ఈ వేడుకలో సందడి చేశారు.

నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్

ఈ గ్రాండ్ రిసెప్షన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా హాజరై కావ్య మారన్, అనిరుధ్ దంపతులను ఆశీర్వదించారు. గత నెలలో కళానిధి మారన్, కావేరి మారన్ దంపతులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి స్వయంగా ఆహ్వాన పత్రిక అందించిన సంగతి తెలిసిందే. వేడుక అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. “అద్భుతమైన జంట కావ్య, అనిరుధ్ కొత్త జీవిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న ఈ అత్యంత ప్రత్యేకమైన రోజున, వారిని, వారి కుటుంబ సభ్యులను కలిసి మా ఆశీస్సులు, శుభాకాంక్షలు అందజేశాం. నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎందరో గొప్ప అతిథులలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఎంకే స్టాలిన్ గారు కూడా ఉన్నారు” అని రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.

సన్‌రైజర్స్ స్టార్లు, సినీ తారల సందడి

ఈ వేడుకలో క్రికెట్, సినీ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ పేసర్ భువనేశ్వర్ కుమార్ నూతన దంపతులతో కలిసి ఫొటోలు దిగగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎస్ఆర్‌హెచ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, దక్షిణాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్, డేనియల్ వెటోరీ, భారత మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ చెన్నైకి చేరుకుని వేడుకలో పాలుపంచుకున్నారు. మరోవైపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నటులు సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ తదితర సినీ ప్రముఖులు హాజరై కావ్య, అనిరుధ్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 November 2026, 9:24 pm Digital Edition : Prabhanews
కావ్య మారన్-అనిరుధ్ గ్రాండ్ రిసెప్షన్.. వేడుకలో మెరిసిన సీఎంలు రేవంత్, విజయ్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 21, 2026 9:10 PM ISTచెన్నైలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ-యజమాని కావ్య మారన్, సంగీత దర్శకుడు అనిరుధ్ వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం విజయ్, రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.News18సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ-యజమాని, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్ చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. నవంబర్ 11న గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న ఈ జంట, శనివారం చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఎరుపు రంగు ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ దుస్తుల్లో కావ్య మెరిసిపోగా, ఎరుపు, నలుపు, సిల్వర్ డిజైన్ జాకెట్‌తో అనిరుధ్ అందరి దృష్టిని ఆకర్షించారు.సినిమా, క్రికెట్, రాజకీయ రంగాల దిగ్గజాలతో ఈ వేడుక తారాలోకాన్ని తలపించింది. అనిరుధ్ మేనమామ, సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ స్టైలిష్ బ్లూ ఇండో-వెస్టర్న్ సూట్‌లో విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్, నటుడు కమల్ హాసన్ కూడా ఈ వేడుకలో సందడి చేశారు.
#EXCLUSIVE | காவியா கலாநிதி மாறன் - அனிருத் ரவிச்சந்தர் திருமண வரவேற்பு விழாவில் சூப்பர்ஸ்டார் ரஜினிகாந்த்!
#SunNews | #KaviyaMaran | #Anirudh | #KaviyaAnirudhReception | @rajinikanth https://t.co/Tunb2zb7mX— Sun News (@sunnewstamil) November 21, 2026నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ఈ గ్రాండ్ రిసెప్షన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా హాజరై కావ్య మారన్, అనిరుధ్ దంపతులను ఆశీర్వదించారు. గత నెలలో కళానిధి మారన్, కావేరి మారన్ దంపతులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి స్వయంగా ఆహ్వాన పత్రిక అందించిన సంగతి తెలిసిందే. వేడుక అనంతరం సీఎం రేవంత్ రెడ్డి 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. "అద్భుతమైన జంట కావ్య, అనిరుధ్ కొత్త జీవిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న ఈ అత్యంత ప్రత్యేకమైన రోజున, వారిని, వారి కుటుంబ సభ్యులను కలిసి మా ఆశీస్సులు, శుభాకాంక్షలు అందజేశాం. నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎందరో గొప్ప అతిథులలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఎంకే స్టాలిన్ గారు కూడా ఉన్నారు" అని రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.
CM Vijay attends the wedding reception of Ms. Kavya Kalanithi Maran and Mr. Anirudh Ravichander. https://t.co/2FULVQs9H2
— Actor Vijay Team (@ActorVijayTeam) November 21, 2026సన్‌రైజర్స్ స్టార్లు, సినీ తారల సందడిఈ వేడుకలో క్రికెట్, సినీ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ పేసర్ భువనేశ్వర్ కుమార్ నూతన దంపతులతో కలిసి ఫొటోలు దిగగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎస్ఆర్‌హెచ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, దక్షిణాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్, డేనియల్ వెటోరీ, భారత మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ చెన్నైకి చేరుకుని వేడుకలో పాలుపంచుకున్నారు. మరోవైపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నటులు సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ తదితర సినీ ప్రముఖులు హాజరై కావ్య, అనిరుధ్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.మరింత చదవండి

Source link