ప్రభన్యూస్

వెండితెరపైకి జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత పోరాటం.. నవంబర్ 27న రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత పోరాటాన్ని తెరపై ఆవిష్కరించిన చిత్రం ఫూలే. నవంబర్ 27న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

News18
News18

జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత పోరాటాన్ని తెరపై ఆవిష్కరించిన చిత్రం ఫూలే.. తెలుగు ప్రేక్షకుల ఆదరణ కోరుతున్న చిత్ర బృందం సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత ప్రయాణం, వారి సామాజిక పోరాటం ఆధారంగా ఈ సినిమాను రూపొందించింది. సమాజంలో నెలకొన్న కులవివక్ష, అసమానతలు, మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.

ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుపదా క్రియేషన్స్ నిర్మిస్తోంది. డా. పొన్నం రవిచంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్య, సమానత్వం, సామాజిక న్యాయం, మహిళా విద్య వంటి అంశాల కోసం ఫూలే దంపతులు సాగించిన పోరాటాన్ని, వారి ఆదర్శప్రాయమైన జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆలోచనలను రేకెత్తించే కథాంశంతో రూపొందింది.

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఫూలే దంపతులు కులవివక్ష నిర్మూలన కోసం, మహిళా విద్య కోసం చేసిన పోరాటం నేటి తరానికి గొప్ప స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు. ఫూలే దంపతుల సామాజిక సేవ, వారి జీవితాలు నేటి సమాజానికి ఎంతో అవసరమైన సందేశాన్ని అందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

‘ఫూలే’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. సమాజంలో మార్పు కోసం పోరాడిన ఇద్దరు మహనీయుల జీవితాలను, వారి ఆశయాలను, వారు ఎదుర్కొన్న అడ్డంకులను మన ముందుకు తీసుకొచ్చే ఒక చారిత్రాత్మక కథనం. నేటి యువత, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ ఫూలే దంపతుల జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సమానత్వం, విద్య, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి విలువలను గుర్తుచేసే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలో వీక్షించాలని చిత్ర బృందం కోరుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 November 2026, 7:35 pm Digital Edition : Prabhanews
వెండితెరపైకి జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత పోరాటం.. నవంబర్ 27న రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 21, 2026 6:38 PM ISTజ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత పోరాటాన్ని తెరపై ఆవిష్కరించిన చిత్రం ఫూలే. నవంబర్ 27న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. News18జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత పోరాటాన్ని తెరపై ఆవిష్కరించిన చిత్రం ఫూలే.. తెలుగు ప్రేక్షకుల ఆదరణ కోరుతున్న చిత్ర బృందం సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత ప్రయాణం, వారి సామాజిక పోరాటం ఆధారంగా ఈ సినిమాను రూపొందించింది. సమాజంలో నెలకొన్న కులవివక్ష, అసమానతలు, మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుపదా క్రియేషన్స్ నిర్మిస్తోంది. డా. పొన్నం రవిచంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్య, సమానత్వం, సామాజిక న్యాయం, మహిళా విద్య వంటి అంశాల కోసం ఫూలే దంపతులు సాగించిన పోరాటాన్ని, వారి ఆదర్శప్రాయమైన జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆలోచనలను రేకెత్తించే కథాంశంతో రూపొందింది.తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఫూలే దంపతులు కులవివక్ష నిర్మూలన కోసం, మహిళా విద్య కోసం చేసిన పోరాటం నేటి తరానికి గొప్ప స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు. ఫూలే దంపతుల సామాజిక సేవ, వారి జీవితాలు నేటి సమాజానికి ఎంతో అవసరమైన సందేశాన్ని అందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.‘ఫూలే’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. సమాజంలో మార్పు కోసం పోరాడిన ఇద్దరు మహనీయుల జీవితాలను, వారి ఆశయాలను, వారు ఎదుర్కొన్న అడ్డంకులను మన ముందుకు తీసుకొచ్చే ఒక చారిత్రాత్మక కథనం. నేటి యువత, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ ఫూలే దంపతుల జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సమానత్వం, విద్య, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి విలువలను గుర్తుచేసే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలో వీక్షించాలని చిత్ర బృందం కోరుతోంది.మరింత చదవండి

Source link