సమంత తమ కొడుకుకు పెట్టిన పేరు ఇప్పుడు నెట్టింట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సంస్కృత మూలాలున్న ‘దేవ్’ అనే పదానికి దేవుడు, దైవత్వం, పవిత్రత, తేజస్సు అనే గొప్ప అర్థాలు ఉన్నాయి. చిన్నగా, ఆధునికంగా ఉంటూనే ఆధ్యాత్మిక భావాన్ని పంచే ఈ పేరును అభిమానులు తెగ ప్రశంసిస్తున్నారు. రాజ్- సమంత జోడీకి దేవుడిచ్చిన గొప్ప ప్రసాదం ఈ బిడ్డ అని కామెంట్స్ చేస్తున్నారు.

