ప్రభన్యూస్

JEE Main 2027: అప్లై చేయడానికి రెండ్రోజులే.. ఈ వివరాలు తప్పనిసరిగా చెక్ చేసుకోండి! |


Last Updated:

జేఈఈ మెయిన్ 2027 మొదటి విడత పరీక్షకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. NTA ప్రకారం నవంబర్ 22 చివరి గడువు. అభ్యర్థులు ఫీజు చెల్లించి కన్ఫర్మేషన్ పేజీ భద్రపరుచుకోవాలి.

News18
News18

జేఈఈ మెయిన్ 2027 మొదటి విడత పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 11,67,228 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. వీరిలో 9,53,368 మంది మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించారు. రిజిస్ట్రేషన్ చేసినవారికి, ఫీజు కట్టినవారికి మధ్య ఉన్న వ్యత్యాసం చూస్తే ఇంకా చాలామంది దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉందని అర్థమవుతోంది. పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ను పరిశీలించవచ్చు.

నవంబర్ 22తో ముగియనున్న గడువు

జేఈఈ మెయిన్ 2027 సెషన్‌ 1కు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 22, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. ఇంకా అప్లికేషన్‌ ప్రారంభించని వారు, ఫీజు చెల్లించకుండా మధ్యలోనే ఆపేసిన వారు వెంటనే ప్రక్రియను పూర్తి చేయాలి. చివరి రోజుల్లో వెబ్‌సైట్‌పై రద్దీ పెరిగి సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌ చెల్లింపులు ఆలస్యం కావచ్చు. అందువల్ల చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఫారం సమర్పించి, ఫీజు చెల్లించాలి. అనంతరం కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

అప్లికేషన్‌లో ఈ వివరాలు సరిచూసుకోండి

దరఖాస్తు పంపించే ముందు అభ్యర్థులు తమ పేరు అక్షరాలు, కేటగిరీ వివరాలు, ఫొటో, సంతకం తదితర సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. కేవలం రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిందని అప్లికేషన్ పూర్తయినట్లు భావించకూడదు. ఫీజు చెల్లింపు విజయవంతమై, కన్ఫర్మేషన్ పేజీ వచ్చినప్పుడే దరఖాస్తు ప్రక్రియ పూర్తయినట్లు గుర్తించాలి. ఏవైనా సందేహాలు లేదా సాంకేతిక సమస్యలు ఎదురైతే 011-40759000, 1800-180-4747 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు. లేదా jeemain\@nta.ac.in కు ఈమెయిల్ పంపవచ్చు.

కన్ఫర్మేషన్ పేజీని భద్రపరుచుకోండి

ఫీజు చెల్లించిన తర్వాత వచ్చే కన్ఫర్మేషన్ పేజీ దరఖాస్తు పూర్తయినట్లు తెలిపే ముఖ్యమైన ఆధారం. దాన్ని ఫోన్‌లో భద్రపరచుకోవడంతో పాటు ప్రింట్ తీసి పెట్టుకోవడం మంచిది. అడ్మిట్ కార్డు, కౌన్సెలింగ్, ఇతర తదుపరి ప్రక్రియల్లో ఈ పత్రం ఉపయోగపడుతుంది.

పాత ప్రశ్నపత్రాలతో సాధన చేయండి

దరఖాస్తు పూర్తయ్యాక పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలి. గత సంవత్సరాల జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రాలను సమయ పరిమితితో సాధన చేయడం ఉపయోగకరం. దీనివల్ల ప్రశ్నల సరళి, పరీక్ష విధానం, మార్కుల కేటాయింపుపై అవగాహన పెరుగుతుంది. తప్పుగా సమాధానాలు ఇచ్చిన ప్రశ్నలను ప్రత్యేక నోటుపుస్తకంలో రాసుకుని, బలహీనమైన అంశాలను మళ్లీ చదవాలి. వేగం, కచ్చితత్వం పెంచుకునేందుకు క్రమం తప్పకుండా సాధన చేయాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 November 2026, 1:37 pm Digital Edition : Prabhanews
JEE Main 2027: అప్లై చేయడానికి రెండ్రోజులే.. ఈ వివరాలు తప్పనిసరిగా చెక్ చేసుకోండి! |

Last Updated:Nov 20, 2026 12:42 PM ISTజేఈఈ మెయిన్ 2027 మొదటి విడత పరీక్షకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. NTA ప్రకారం నవంబర్ 22 చివరి గడువు. అభ్యర్థులు ఫీజు చెల్లించి కన్ఫర్మేషన్ పేజీ భద్రపరుచుకోవాలి.News18జేఈఈ మెయిన్ 2027 మొదటి విడత పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 11,67,228 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. వీరిలో 9,53,368 మంది మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించారు. రిజిస్ట్రేషన్ చేసినవారికి, ఫీజు కట్టినవారికి మధ్య ఉన్న వ్యత్యాసం చూస్తే ఇంకా చాలామంది దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉందని అర్థమవుతోంది. పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ను పరిశీలించవచ్చు.నవంబర్ 22తో ముగియనున్న గడువుజేఈఈ మెయిన్ 2027 సెషన్‌ 1కు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 22, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. ఇంకా అప్లికేషన్‌ ప్రారంభించని వారు, ఫీజు చెల్లించకుండా మధ్యలోనే ఆపేసిన వారు వెంటనే ప్రక్రియను పూర్తి చేయాలి. చివరి రోజుల్లో వెబ్‌సైట్‌పై రద్దీ పెరిగి సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌ చెల్లింపులు ఆలస్యం కావచ్చు. అందువల్ల చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఫారం సమర్పించి, ఫీజు చెల్లించాలి. అనంతరం కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.అప్లికేషన్‌లో ఈ వివరాలు సరిచూసుకోండిదరఖాస్తు పంపించే ముందు అభ్యర్థులు తమ పేరు అక్షరాలు, కేటగిరీ వివరాలు, ఫొటో, సంతకం తదితర సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. కేవలం రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిందని అప్లికేషన్ పూర్తయినట్లు భావించకూడదు. ఫీజు చెల్లింపు విజయవంతమై, కన్ఫర్మేషన్ పేజీ వచ్చినప్పుడే దరఖాస్తు ప్రక్రియ పూర్తయినట్లు గుర్తించాలి. ఏవైనా సందేహాలు లేదా సాంకేతిక సమస్యలు ఎదురైతే 011-40759000, 1800-180-4747 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు. లేదా jeemain\@nta.ac.in కు ఈమెయిల్ పంపవచ్చు.కన్ఫర్మేషన్ పేజీని భద్రపరుచుకోండిఫీజు చెల్లించిన తర్వాత వచ్చే కన్ఫర్మేషన్ పేజీ దరఖాస్తు పూర్తయినట్లు తెలిపే ముఖ్యమైన ఆధారం. దాన్ని ఫోన్‌లో భద్రపరచుకోవడంతో పాటు ప్రింట్ తీసి పెట్టుకోవడం మంచిది. అడ్మిట్ కార్డు, కౌన్సెలింగ్, ఇతర తదుపరి ప్రక్రియల్లో ఈ పత్రం ఉపయోగపడుతుంది.పాత ప్రశ్నపత్రాలతో సాధన చేయండిదరఖాస్తు పూర్తయ్యాక పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలి. గత సంవత్సరాల జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రాలను సమయ పరిమితితో సాధన చేయడం ఉపయోగకరం. దీనివల్ల ప్రశ్నల సరళి, పరీక్ష విధానం, మార్కుల కేటాయింపుపై అవగాహన పెరుగుతుంది. తప్పుగా సమాధానాలు ఇచ్చిన ప్రశ్నలను ప్రత్యేక నోటుపుస్తకంలో రాసుకుని, బలహీనమైన అంశాలను మళ్లీ చదవాలి. వేగం, కచ్చితత్వం పెంచుకునేందుకు క్రమం తప్పకుండా సాధన చేయాలి.మరింత చదవండి

Source link