ప్రభన్యూస్

OM Movie Review: ఓం మూవీ రివ్యూ.. ఇంతకీ ధనుష్- సాయి పల్లవి మ్యాజిక్ వర్కవుట్ అయ్యిందా? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ధనుష్, సాయి పల్లవి, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఓం మూవీ నేడే (నవంబర్ 20) గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దామా..

News18
News18

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా, సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నడిచిన సినిమా ‘ఓం: ఆపరేషన్ మోల్’ (O.M: Operation మోల్). రేణు దేశాయ్ మరో కీలక పాత్రలో నటించింది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా నేడు (నవంబర్ 20) గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్, మమ్ముట్టి తొలిసారి కలిసి నటించడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ అంచనాల నడుమ ‘ఓం’ ప్రేక్షకులను మెప్పించిందా? ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి రోల్స్ ఎలా ఉన్నాయి, కథ, కథనాలు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో సాగుతున్న గంధపు చెక్కల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి దానికి బాస్‌గా ఐపీఎస్ ఆఫీసర్ నిత్యా రెడ్డి (సాయి పల్లవి) ని నియమిస్తుంది. స్మగ్లింగ్ మూలాలను పెకిలించేందుకు తన టీమ్‌లోని సమర్థుడైన అధికారి తిరు కుమరన్ అలియాస్ పళని (ధనుష్)ను అండర్ కవర్ ఆఫీసర్‌గా రంగంలోకి దించుతుంది.

కడప కేంద్రంగా గంధపు చెక్కల సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న బలమైన రాజకీయ నేత బర్మా కార్తీకేయ అలియాస్ సియా (మమ్ముట్టి) ముఠాలోకి తిరు అత్యంత చాకచక్యంగా చొరబడతాడు. ఆపై సియాకు అత్యంత నమ్మకస్తుడిగా మారి, ముఠాలో కీలక వ్యక్తిగా ఎదుగుతాడు. ఈ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారి, దుబాయ్‌లో తలదాచుకున్న అబ్దుల్ (నసీరుద్దీన్ షా) ఆచూకీని కనిపెట్టేందుకు తిరు ఒక భారీ వ్యూహాన్ని రచిస్తాడు. ఇందులో భాగంగా ఏకంగా వెయ్యి టన్నుల గంధపు చెక్కలను తరలించేందుకు ప్లాన్ చేస్తారు. తొలి విడతలో 300 టన్నుల సరుకును సురక్షితంగా చేరవేసిన అనంతరం, మిగిలిన 700 టన్నుల సరుకును తరలించేందుకు సియా, తిరు సిద్ధమవుతారు.

అయితే, ఈ భారీ ఆపరేషన్ సమయంలోనే పోలీసులు, సియా ముఠా మధ్య భీకర ఎదురుకాల్పులు జరుగుతాయి. ఈ ఘటనలో అమాయకుడైన తిరు తండ్రి చనిపోతాడు. అనంతరం పోలీసులు సియాను అరెస్ట్ చేయడంతో కథ అనూహ్య మలుపు తిరుగుతుంది. అయితే ఈ సీక్రెట్ ఆపరేషన్ లో నిత్యా రెడ్డి, తిరు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? తిరుపై అతని భార్య రోజా (శ్రీలీల) ఎందుకు అసంతృప్తిగా ఉంది? ఆమె విడాకులు తీసుకోవాలనుకోవడానికి గల బలమైన కారణాలేమిటి? తిరు తండ్రిని ఎందుకు చంపుతారు. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఎర్రచందనం స్మగ్లింగ్ అనగానే ప్రతి ఒక్కరికీ పుష్ప సినిమానే గుర్తొస్తుంది. పుష్ప ఛాయలు ఈ సినిమాలో అక్కడక్కడా కనిపించినప్పటికీ, కథను మాత్రం చాలా నెమ్మదిగా తీసుకెళ్లాడు దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో యాక్షన్ సీన్లతో పాటు ఎమోషన్స్ పండించడానికి బాగానే ట్రై చేశారు కానీ పెద్దగా వర్కవుట్ కాలేదనే చెప్పుకోవాలి. ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి పరిచయాలతో స్లోగా మొదలైన ఫస్టాఫ్ ఇంటర్వెల్ సమయానికి ఊపందునుకుంది. ప్రీ ఇంటర్వెల్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. ఆ తర్వాత సెకండాఫ్ కూడా స్లో నేరేషన్ తో తీసుకెళ్ళినప్పటికీ, కథలో ట్విస్టులు ఆకట్టుకున్నాయి. వీర పాటతో థియేటర్స్ హోరెత్తించారు. క్లైమాక్స్ సన్నివేశాలు ఇంకాస్త మెరుగ్గా రాసుకుంటే బాగుండేది. సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం.

నటీనటులు, టెక్నీషియన్స్ పనితీరు:

అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా, ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా ధనుష్ తన నటనతో ఆకట్టుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో సాయి పల్లవి అదరగొట్టింది. తన సహజ నటనతో ఆడియన్స్ చేత వావ్ అనిపించింది. మమ్ముట్టి తన పాత్రలో ఒదిగిపోయి నటించారు. శ్రీలీల ఉన్నంతలో ఓకే అనొచ్చు. విలన్ గా నసీరుద్దీన్ షా తనకిచ్చిన పాత్రకు న్యాయం చేశారు. దర్శకుడు కథను హ్యాండిల్ చేసిన తీరు బాగానే ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది.

మొత్తంగా చెప్పాలంటే.. ధనుష్ – సాయి పల్లవి ఆపరేషన్ సూపర్ అని మాత్రం అనలేం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 November 2026, 1:33 pm Digital Edition : Prabhanews
OM Movie Review: ఓం మూవీ రివ్యూ.. ఇంతకీ ధనుష్- సాయి పల్లవి మ్యాజిక్ వర్కవుట్ అయ్యిందా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 20, 2026 1:04 PM ISTధనుష్, సాయి పల్లవి, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఓం మూవీ నేడే (నవంబర్ 20) గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దామా.. News18కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా, సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నడిచిన సినిమా ‘ఓం: ఆపరేషన్ మోల్’ (O.M: Operation మోల్). రేణు దేశాయ్ మరో కీలక పాత్రలో నటించింది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా నేడు (నవంబర్ 20) గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్, మమ్ముట్టి తొలిసారి కలిసి నటించడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ అంచనాల నడుమ ‘ఓం’ ప్రేక్షకులను మెప్పించిందా? ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి రోల్స్ ఎలా ఉన్నాయి, కథ, కథనాలు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.కథ:ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో సాగుతున్న గంధపు చెక్కల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి దానికి బాస్‌గా ఐపీఎస్ ఆఫీసర్ నిత్యా రెడ్డి (సాయి పల్లవి) ని నియమిస్తుంది. స్మగ్లింగ్ మూలాలను పెకిలించేందుకు తన టీమ్‌లోని సమర్థుడైన అధికారి తిరు కుమరన్ అలియాస్ పళని (ధనుష్)ను అండర్ కవర్ ఆఫీసర్‌గా రంగంలోకి దించుతుంది.కడప కేంద్రంగా గంధపు చెక్కల సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న బలమైన రాజకీయ నేత బర్మా కార్తీకేయ అలియాస్ సియా (మమ్ముట్టి) ముఠాలోకి తిరు అత్యంత చాకచక్యంగా చొరబడతాడు. ఆపై సియాకు అత్యంత నమ్మకస్తుడిగా మారి, ముఠాలో కీలక వ్యక్తిగా ఎదుగుతాడు. ఈ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారి, దుబాయ్‌లో తలదాచుకున్న అబ్దుల్ (నసీరుద్దీన్ షా) ఆచూకీని కనిపెట్టేందుకు తిరు ఒక భారీ వ్యూహాన్ని రచిస్తాడు. ఇందులో భాగంగా ఏకంగా వెయ్యి టన్నుల గంధపు చెక్కలను తరలించేందుకు ప్లాన్ చేస్తారు. తొలి విడతలో 300 టన్నుల సరుకును సురక్షితంగా చేరవేసిన అనంతరం, మిగిలిన 700 టన్నుల సరుకును తరలించేందుకు సియా, తిరు సిద్ధమవుతారు.అయితే, ఈ భారీ ఆపరేషన్ సమయంలోనే పోలీసులు, సియా ముఠా మధ్య భీకర ఎదురుకాల్పులు జరుగుతాయి. ఈ ఘటనలో అమాయకుడైన తిరు తండ్రి చనిపోతాడు. అనంతరం పోలీసులు సియాను అరెస్ట్ చేయడంతో కథ అనూహ్య మలుపు తిరుగుతుంది. అయితే ఈ సీక్రెట్ ఆపరేషన్ లో నిత్యా రెడ్డి, తిరు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? తిరుపై అతని భార్య రోజా (శ్రీలీల) ఎందుకు అసంతృప్తిగా ఉంది? ఆమె విడాకులు తీసుకోవాలనుకోవడానికి గల బలమైన కారణాలేమిటి? తిరు తండ్రిని ఎందుకు చంపుతారు. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.విశ్లేషణ:ఎర్రచందనం స్మగ్లింగ్ అనగానే ప్రతి ఒక్కరికీ పుష్ప సినిమానే గుర్తొస్తుంది. పుష్ప ఛాయలు ఈ సినిమాలో అక్కడక్కడా కనిపించినప్పటికీ, కథను మాత్రం చాలా నెమ్మదిగా తీసుకెళ్లాడు దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో యాక్షన్ సీన్లతో పాటు ఎమోషన్స్ పండించడానికి బాగానే ట్రై చేశారు కానీ పెద్దగా వర్కవుట్ కాలేదనే చెప్పుకోవాలి. ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి పరిచయాలతో స్లోగా మొదలైన ఫస్టాఫ్ ఇంటర్వెల్ సమయానికి ఊపందునుకుంది. ప్రీ ఇంటర్వెల్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. ఆ తర్వాత సెకండాఫ్ కూడా స్లో నేరేషన్ తో తీసుకెళ్ళినప్పటికీ, కథలో ట్విస్టులు ఆకట్టుకున్నాయి. వీర పాటతో థియేటర్స్ హోరెత్తించారు. క్లైమాక్స్ సన్నివేశాలు ఇంకాస్త మెరుగ్గా రాసుకుంటే బాగుండేది. సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం.నటీనటులు, టెక్నీషియన్స్ పనితీరు:అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా, ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా ధనుష్ తన నటనతో ఆకట్టుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో సాయి పల్లవి అదరగొట్టింది. తన సహజ నటనతో ఆడియన్స్ చేత వావ్ అనిపించింది. మమ్ముట్టి తన పాత్రలో ఒదిగిపోయి నటించారు. శ్రీలీల ఉన్నంతలో ఓకే అనొచ్చు. విలన్ గా నసీరుద్దీన్ షా తనకిచ్చిన పాత్రకు న్యాయం చేశారు. దర్శకుడు కథను హ్యాండిల్ చేసిన తీరు బాగానే ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది.మొత్తంగా చెప్పాలంటే.. ధనుష్ - సాయి పల్లవి ఆపరేషన్ సూపర్ అని మాత్రం అనలేం.మరింత చదవండి

Source link