CNN-News18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2026 అవార్డుల వేడుకలో నటుడు ధనుష్ తన కుమారులు యాత్ర రాజా, లింగ రాజాతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా ధనుష్ సినిమాల్లో తమకు ఎంతో ఇష్టమైన చిత్రాల గురించి ఆయన కొడుకులు సరదాగా పంచుకున్నారు. అనంతరం వేదికపై ధనుష్ తన కుమారుల గురించి ఎమోషనల్గా మాట్లాడారు. “నేను ఏం చేసినా ఈ ఇద్దరు అబ్బాయిలు గర్వపడేలా చేయడానికే చేస్తాను.. తద్వారా భవిష్యత్తులో వీళ్లు నన్ను గర్వపడేలా చేస్తారు. ప్రతి తండ్రి తన పిల్లలను ప్రేమిస్తాడు కాబట్టి నేను వాళ్లను ప్రేమిస్తున్నానని చెప్పడం సాధారణ విషయమే, కానీ నా జీవితంలో వీళ్లే అత్యంత ముఖ్యమైనవారు” అంటూ ధనుష్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.ID_SS
Source link
Dhanush Gets Emotional : ధనుష్ & తనయుల క్యూట్ మూమెంట్!
