ప్రభన్యూస్

Devi Vigyanam Movie: సైన్స్‌కు అందని రహస్యాలు.. ఆధ్యాత్మికత కథతో ‘దేవి విజ్ఞానం’.. రిలీజ్ ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సైన్స్‌కు అందని విషయాలు ఈ ప్రపంచంలో ఉన్నాయా? మనిషి నమ్మకాలు, ఆధ్యాత్మిక అనుభవాల మధ్య ఎలాంటి సంబంధం ఉంది? హేతుబద్ధమైన ఆలోచనలకు సమాధానం దొరకని ప్రశ్నలు ఎదురైతే మనిషి ప్రయాణం ఎలా ఉంటుంది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన హిందీ సినిమాను ‘దేవి విజ్ఞానం’.

News18
News18

సైన్స్‌కు అందని విషయాలు ఈ ప్రపంచంలో ఉన్నాయా? మనిషి నమ్మకాలు, ఆధ్యాత్మిక అనుభవాల మధ్య ఎలాంటి సంబంధం ఉంది? హేతుబద్ధమైన ఆలోచనలకు సమాధానం దొరకని ప్రశ్నలు ఎదురైతే మనిషి ప్రయాణం ఎలా ఉంటుంది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన హిందీ సినిమాను ‘దేవి విజ్ఞానం’. సైన్స్, హేతువాదం, ఆధ్యాత్మికతల మధ్య ఉన్న సంబంధాన్ని కథా నేపథ్యంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. కార్తవ్య షా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కింగ్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన మూవీ టీమ్ గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్‌ను ప్రత్యేకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా సినిమా కథాంశం, ఇందులో ప్రస్తావించిన అంశాలు, విడుదలకు సంబంధించిన వివరాలను ఆయనతో పంచుకుంది. చిత్రబృందం చెప్పిన సినిమా నేపథ్యాన్ని ఆసక్తిగా తెలుసుకున్న రాజాసింగ్.. సినిమా విడుదల సందర్భంగా టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా టీ రాజాసింగ్ మాట్లాడుతూ.. సినిమాలు కథలను ప్రేక్షకులకు చేరవేయడమే కాకుండా, జీవితం, సమాజంలోని విభిన్న అంశాలపై ఆలోచించేలా చేసే ముఖ్యమైన మాధ్యమాలని అన్నారు. ‘దేవి విజ్ఞానం’ ఎంచుకున్న కథాంశం ఆసక్తికరంగా ఉందని పేర్కొన్నారు. సినిమా విడుదల సందర్భంగా చిత్రబృందంలోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన లభించాలని ఆశిస్తున్నానని తెలిపారు.

డ్రామా, మిస్టరీ, భక్తి అంశాల కలయికగా ‘దేవి విజ్ఞానం’ రూపొందింది. ఈ సినిమా కథ ఒక నాస్తికుడి చుట్టూ తిరుగుతుంది. దైవం, ఆధ్యాత్మికత వంటి అంశాలను నమ్మని ఓ వ్యక్తి జీవితంలో కొన్ని అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటాయి. అతడు బలంగా నమ్మిన సిద్ధాంతాలనే ప్రశ్నించే పరిస్థితులు ఎదురవుతాయి. దీంతో అతడి ఆలోచనా విధానంలో మార్పులు మొదలవుతాయి. ఈ క్రమంలో కర్ణి మాత దైవిక శక్తిని అన్వేషించే అసాధారణ ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రయాణంలో అతడికి ఎదురయ్యే అనుభవాలు, వాటి ద్వారా జీవితం, ప్రపంచం గురించి అతడిలో కలిగే కొత్త అవగాహన ఈ చిత్రంలో ప్రధానంగా చూపించనున్నారు.

దర్శకుడు కార్తవ్య షా మాట్లాడుతూ.. మానవీయ కథ ద్వారా సైన్స్, ఆధ్యాత్మికత మధ్య ఉన్న సంబంధాన్ని అన్వేషించాలనే ఆలోచనతో ఈ సినిమాను రూపొందించినట్లు తెలిపారు. ఉన్నతమైన శక్తి ఉనికిని ప్రశ్నించే వ్యక్తి తన నమ్మకాలను పరీక్షించే పరిస్థితులను ఎదుర్కొంటే అతడి ఆలోచనల్లో ఎలాంటి మార్పులు వస్తాయనే అంశాన్ని ఇందులో చూపించామన్నారు. విశ్వాసం, మనిషి దృక్పథం, మానవ అవగాహనకు ఉన్న పరిమితుల గురించి ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుందని పేర్కొన్నారు.

ఇక ఈ చిత్రంలో చేతన్ ధనాని, కె. ఆర్యవర్ధన్, పూజా జోషి, టిక్కు తల్సానియా, మెహుల్ బుచ్, అలోక్ ఠాకర్, క్రుష్ దేబూ, నీలేష్ భట్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కింగ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై హనుమాన్ మల్ తాటర్, లతేష్ సోనీ, అలోక్ ఠాకర్, మన్మోహన్ రాఠీ ఈ చిత్రాన్ని నిర్మించారు. అభిషేక్ శర్మ, మోహిత్ శర్మ, విరల్ మెహతా సహ నిర్మాతలుగా వ్యవహరించారు. పృథ్వీ పాటిల్ కథను రచించారు. సైన్స్, ఆధ్యాత్మికత మధ్య సంఘర్షణను ఆసక్తికరంగా ఆవిష్కరించనున్న ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 9:03 pm Digital Edition : Prabhanews
Devi Vigyanam Movie: సైన్స్‌కు అందని రహస్యాలు.. ఆధ్యాత్మికత కథతో ‘దేవి విజ్ఞానం’.. రిలీజ్ ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 17, 2026 8:59 PM ISTసైన్స్‌కు అందని విషయాలు ఈ ప్రపంచంలో ఉన్నాయా? మనిషి నమ్మకాలు, ఆధ్యాత్మిక అనుభవాల మధ్య ఎలాంటి సంబంధం ఉంది? హేతుబద్ధమైన ఆలోచనలకు సమాధానం దొరకని ప్రశ్నలు ఎదురైతే మనిషి ప్రయాణం ఎలా ఉంటుంది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన హిందీ సినిమాను ‘దేవి విజ్ఞానం’.News18సైన్స్‌కు అందని విషయాలు ఈ ప్రపంచంలో ఉన్నాయా? మనిషి నమ్మకాలు, ఆధ్యాత్మిక అనుభవాల మధ్య ఎలాంటి సంబంధం ఉంది? హేతుబద్ధమైన ఆలోచనలకు సమాధానం దొరకని ప్రశ్నలు ఎదురైతే మనిషి ప్రయాణం ఎలా ఉంటుంది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన హిందీ సినిమాను ‘దేవి విజ్ఞానం’. సైన్స్, హేతువాదం, ఆధ్యాత్మికతల మధ్య ఉన్న సంబంధాన్ని కథా నేపథ్యంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. కార్తవ్య షా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కింగ్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన మూవీ టీమ్ గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్‌ను ప్రత్యేకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా సినిమా కథాంశం, ఇందులో ప్రస్తావించిన అంశాలు, విడుదలకు సంబంధించిన వివరాలను ఆయనతో పంచుకుంది. చిత్రబృందం చెప్పిన సినిమా నేపథ్యాన్ని ఆసక్తిగా తెలుసుకున్న రాజాసింగ్.. సినిమా విడుదల సందర్భంగా టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా టీ రాజాసింగ్ మాట్లాడుతూ.. సినిమాలు కథలను ప్రేక్షకులకు చేరవేయడమే కాకుండా, జీవితం, సమాజంలోని విభిన్న అంశాలపై ఆలోచించేలా చేసే ముఖ్యమైన మాధ్యమాలని అన్నారు. ‘దేవి విజ్ఞానం’ ఎంచుకున్న కథాంశం ఆసక్తికరంగా ఉందని పేర్కొన్నారు. సినిమా విడుదల సందర్భంగా చిత్రబృందంలోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన లభించాలని ఆశిస్తున్నానని తెలిపారు.డ్రామా, మిస్టరీ, భక్తి అంశాల కలయికగా ‘దేవి విజ్ఞానం’ రూపొందింది. ఈ సినిమా కథ ఒక నాస్తికుడి చుట్టూ తిరుగుతుంది. దైవం, ఆధ్యాత్మికత వంటి అంశాలను నమ్మని ఓ వ్యక్తి జీవితంలో కొన్ని అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటాయి. అతడు బలంగా నమ్మిన సిద్ధాంతాలనే ప్రశ్నించే పరిస్థితులు ఎదురవుతాయి. దీంతో అతడి ఆలోచనా విధానంలో మార్పులు మొదలవుతాయి. ఈ క్రమంలో కర్ణి మాత దైవిక శక్తిని అన్వేషించే అసాధారణ ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రయాణంలో అతడికి ఎదురయ్యే అనుభవాలు, వాటి ద్వారా జీవితం, ప్రపంచం గురించి అతడిలో కలిగే కొత్త అవగాహన ఈ చిత్రంలో ప్రధానంగా చూపించనున్నారు.దర్శకుడు కార్తవ్య షా మాట్లాడుతూ.. మానవీయ కథ ద్వారా సైన్స్, ఆధ్యాత్మికత మధ్య ఉన్న సంబంధాన్ని అన్వేషించాలనే ఆలోచనతో ఈ సినిమాను రూపొందించినట్లు తెలిపారు. ఉన్నతమైన శక్తి ఉనికిని ప్రశ్నించే వ్యక్తి తన నమ్మకాలను పరీక్షించే పరిస్థితులను ఎదుర్కొంటే అతడి ఆలోచనల్లో ఎలాంటి మార్పులు వస్తాయనే అంశాన్ని ఇందులో చూపించామన్నారు. విశ్వాసం, మనిషి దృక్పథం, మానవ అవగాహనకు ఉన్న పరిమితుల గురించి ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుందని పేర్కొన్నారు.ఇక ఈ చిత్రంలో చేతన్ ధనాని, కె. ఆర్యవర్ధన్, పూజా జోషి, టిక్కు తల్సానియా, మెహుల్ బుచ్, అలోక్ ఠాకర్, క్రుష్ దేబూ, నీలేష్ భట్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కింగ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై హనుమాన్ మల్ తాటర్, లతేష్ సోనీ, అలోక్ ఠాకర్, మన్మోహన్ రాఠీ ఈ చిత్రాన్ని నిర్మించారు. అభిషేక్ శర్మ, మోహిత్ శర్మ, విరల్ మెహతా సహ నిర్మాతలుగా వ్యవహరించారు. పృథ్వీ పాటిల్ కథను రచించారు. సైన్స్, ఆధ్యాత్మికత మధ్య సంఘర్షణను ఆసక్తికరంగా ఆవిష్కరించనున్న ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.మరింత చదవండి

Source link