Last Updated:
ఏడెనిమిదేళ్ల కిందట రకుల్ ప్రీత్ సింగ్ క్రేజ్ టాలీవుడ్లో మాములుగా ఉండేది కాదు. అసలు ఏ స్టార్ హీరో సినిమా అనౌన్స్మెంట్ వచ్చినా సరే అందులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కనిపించేది. ఒక 4, 5 ఏళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏక చక్రాధిపత్యం కొనసాగించింది.
ఏడెనిమిదేళ్ల కిందట రకుల్ ప్రీత్ సింగ్ క్రేజ్ టాలీవుడ్లో మాములుగా ఉండేది కాదు. అసలు ఏ స్టార్ హీరో సినిమా అనౌన్స్మెంట్ వచ్చినా సరే అందులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కనిపించేది. ఒక 4, 5 ఏళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏక చక్రాధిపత్యం కొనసాగించింది. అసలు అప్పట్లో పాతికేళ్ల పై బడిన ప్రతీ కుర్రాడు రకుల్ నామమే జపం చేసేవాళ్లు. అంతలా ఇక్కడ తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. 2011లో వచ్చిన కెరటం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్.. ఫస్ట్ సినిమతోనే డిజాస్టర్ అందుకుంది. ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని సందీప్ కిషన్‌తో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా చేసింది. ఈ సినిమా మాములుగా హిట్టవ్వలేదు. మరీ ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్‌కు తెలుగులో ఓ రేంజ్లో క్రేజ్ సంపాదించి పెట్టింది.
ఆదితో రఫ్, గోపిచంద్‌తో లౌక్యం, మంచు మనోజ్‌తో కరెంట్ తీగ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా మారిపోయింది. రామ్ చరణ్‌తో బ్రూస్లీ, ధృవ.. అల్లు అర్జున్‌తో సరైనోడు, తారక్‌తో నాన్నకు ప్రేమతో, మహేష్ బాబుతో స్పైడర్ ఇలా స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసి తెలుగులో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. అయితే.. రకుల్ ప్రీత్ సింగ్ అదే క్రేజ్‌ను ఎక్కువ కాలం ఉంచుకోలేకపోయింది.
ఆ తర్వాత వరుస ఫ్లాప్‌లు రకుల్ కెరీర్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా తగ్గించేశాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేసే రేంజ్ నుంచి.. టైర్2 హీరోలు నితిన్‌తో చెక్, కొండపోలంలో వైష్ణవ్ తేజ్‌లతో సినిమాలు చేసింది. అయితే.. ఈ సినిమాలు కూడా కమర్షియల్‌గా డిజాస్టర్లు అయ్యాయి. దాంతో తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలే కరువైపోయాయి.
కొండపోలం తర్వాత.. ఇప్పటివరకు తెలుగు స్ట్రైయిట్ సినిమా చేయలేదు. మధ్యలో బూ అంటూ ఒక బైలింగ్యువల్ హార్రర్ సినిమా చేసింది కానీ.. తమిళ ప్రేక్షకులు ఆధరించినంతగా.. మనం ఆ సినిమాను ఆధరించలేదు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ ఇండస్ట్రీకే పరిమితమైపోయింది. అయితే.. డబ్బింగ్ సినిమాలతో మాత్రం అడపా దడపాగా పలకరిస్తూ వస్తుంది. ఆయలాన్, ఇండియన్ 2 వంటి తమిళ డబ్బిగ్ సినిమాల్లో కనిపించింది.
రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన రామాయణం సినిమా రిలీజైన అరివీర భయంకర హిట్టుగా దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.1400 కోట్లకు పైగా కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర ఊచకోత సృష్టిస్తుంది. ఈ సినిమాలో రకుల్ సూర్పనఖ పాత్రలో నటించింది. అసలు ఆ రోల్లో రకుల్ కనిపించింది కాసేపే అయినా.. ఆ ఇంపాక్ట్ మాత్రం చాలా చూపించింది. మరీ ముఖ్యంగా ఆ రోల్లో పర్ఫెక్ట్గా సెట్టయింది.
కాగా.. తాజాగా సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ ఈ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను పంచుకుంది. ఈ క్యారెక్టర్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ఏకంగా 4 గంటల టైమ్ కేటాయించాల్సి వచ్చేదని తెలిపింది. సూర్పనఖ లుక్ కోసం ఆమె జుట్టుతో పాటు టోటల్ మేకప్ అయిపోయే సరికి దాదాపు 4 గంటలు పట్టేదని రివీల్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. నితీష్ తివారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటించగా.. సాయి పల్లవి సీత పాత్రలో నటించింది. ఇక యష్ రావణాసురిడిగా నటించాడు.

