కెమెరాకు దూరమైంది కానీ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పవన్ కల్యాణ్ సినిమాలకు పని చేసింది. గుడుంబా శంకర్, బాలు, అన్నవరం వంటి సినిమాల్లో పనిచేసింది. కేవలం నటిగా మాత్రమే కాదు రేణు దేశాయ్ నిర్మాతగా, దర్శకురాలిగా కూడా చేసింది. మంగళాష్టక్ వన్స్ మోర్, ఇష్క్ వాలా లవ్ వంటి సినిమాలు నిర్మించింది. అంతేకాకుండా ఇష్క్ వాలా లవ్ అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించింది. ఆమె డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా ఇదే. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

