రాజమౌళి మార్క్ ప్రమోషన్స్ మొదలయ్యాయని, ఇకపై ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ రూపంలో క్రేజీ అప్డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచంతో పాటు కాలాన్ని చుట్టేసే ఓ సాహసికుడి (గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచరర్) అద్భుత ప్రయాణంగా ఈ కథ ఉండబోతోందని తెలుస్తోంది. పురాణాల మిళితంతో, సరికొత్త ప్రపంచాలను ఆవిష్కరించే ఈ చిత్రంలో మహేశ్ బాబు రెండు విభిన్నమైన, శక్తివంతమైన పాత్రల్లో కనిపించనున్నారు. ‘రుద్ర’, ‘శ్రీరాముడు’ అనే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో మహేశ్ తన నట విశ్వరూపం చూపించనున్నాడని సమాచారం.

