ప్రభన్యూస్

Namrata Shirodkar: కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి.. ఫొటోస్ వదిలిన నమ్రత | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఘట్టమనేని, గల్లా కుటుంబాల్లో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది.

News18
News18

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఘట్టమనేని, గల్లా కుటుంబాల్లో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. మహేష్ బాబు సోదరి పద్మావతి, అమరరాజా సంస్థల అధినేత, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ దంపతుల చిన్న కుమారుడు సిద్ధార్థ్ గల్లా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సిద్ధార్థ్ ఒక విదేశీ యువతిని పెళ్లాడబోతున్నాడు. దక్షిణ కొరియాకు చెందిన తన ప్రేయసి హైయిన్ కిమ్ (జిన్నీ)తో ఆయన ఏడడుగులు వేసేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఈ ఇండో-కొరియన్ వివాహ వేడుక టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇప్పటికే ఈ జంటకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. వాస్తవానికి ఈ ఏడాది జులై 13న వీరి నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా పెళ్లి సందడి మొదలవ్వడంతో, మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా ఈ వేడుకల ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలలో విదేశీ వధువు హైయిన్ కిమ్ భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆరెంజ్ కలర్ సంప్రదాయ లెహంగాలో, నుదుట తిలకం, ఆకర్షణీయమైన ఆభరణాలు ధరించిన ఆమె అచ్చమైన తెలుగింటి కోడలిలా కనిపిస్తోంది. సిద్ధార్థ్ గల్లా లేత రంగు కుర్తా సెట్‌లో ఎంతో హుషారుగా కనిపించాడు.

ఈ ఫోటోలను నెటిజన్లతో పంచుకున్న నమ్రత.. ‘‘కుటుంబ సభ్యులతో కలిసి గడిపే ప్రతి క్షణం ఎంతో ఆనందంగా ఉంటుంది. సిద్ధార్థ్, కిమ్ మీ ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు. మీ వైవాహిక జీవితం ప్రేమానురాగాలతో, సంతోషాలతో నిండిపోవాలని.. జీవితాంతం ఇలాగే కలిసిమెలిసి సాగిపోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను’’ అంటూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోటోల్లో నమ్రతతో పాటు పద్మావతి, మంజుల ఘట్టమనేని తదితరులు సందడి చేశారు. అయితే ఈ ఫోటోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించకపోవడం అభిమానులను కొద్దిగా నిరాశపరిచింది. ప్రస్తుతం మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ (వారణాసి) పనుల్లో అత్యంత బిజీగా ఉన్నారు. ఆ సినిమా వర్క్ షాప్స్, ఇతర కమిట్‌మెంట్స్ వల్లే ఆయన ఈ వేడుకకు హాజరు కాలేకపోయినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, సిద్ధార్థ్, హైయిన్ కిమ్ లది ప్రేమ వివాహం. విదేశాల్లో చదువుకునే రోజుల్లోనే వీరికి పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారినట్లు సమాచారం. హైయిన్ కిమ్ కు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అయినప్పటికీ ఆమె మీడియాకు, లైమ్ లైట్ కు దూరంగా ఉంటారు. ఇక గల్లా జయదేవ్ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కొడుకు అశోక్ గల్లా ‘హీరో’, ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రాలతో టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ తమ్ముడు సిద్ధార్థ్ మాత్రం సినిమాలకు దూరంగా, వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి కుటుంబ వ్యాపార బాధ్యతలు చూసుకుంటున్నారు. త్వరలో జరగబోయే వీరి వివాహం ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగనుందని జోరుగా ప్రచారం సాగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 November 2026, 3:24 pm Digital Edition : Prabhanews
Namrata Shirodkar: కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి.. ఫొటోస్ వదిలిన నమ్రత | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 14, 2026 3:09 PM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఘట్టమనేని, గల్లా కుటుంబాల్లో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. News18టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఘట్టమనేని, గల్లా కుటుంబాల్లో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. మహేష్ బాబు సోదరి పద్మావతి, అమరరాజా సంస్థల అధినేత, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ దంపతుల చిన్న కుమారుడు సిద్ధార్థ్ గల్లా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సిద్ధార్థ్ ఒక విదేశీ యువతిని పెళ్లాడబోతున్నాడు. దక్షిణ కొరియాకు చెందిన తన ప్రేయసి హైయిన్ కిమ్ (జిన్నీ)తో ఆయన ఏడడుగులు వేసేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఈ ఇండో-కొరియన్ వివాహ వేడుక టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇప్పటికే ఈ జంటకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. వాస్తవానికి ఈ ఏడాది జులై 13న వీరి నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా పెళ్లి సందడి మొదలవ్వడంతో, మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా ఈ వేడుకల ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలలో విదేశీ వధువు హైయిన్ కిమ్ భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆరెంజ్ కలర్ సంప్రదాయ లెహంగాలో, నుదుట తిలకం, ఆకర్షణీయమైన ఆభరణాలు ధరించిన ఆమె అచ్చమైన తెలుగింటి కోడలిలా కనిపిస్తోంది. సిద్ధార్థ్ గల్లా లేత రంగు కుర్తా సెట్‌లో ఎంతో హుషారుగా కనిపించాడు.ఈ ఫోటోలను నెటిజన్లతో పంచుకున్న నమ్రత.. ‘‘కుటుంబ సభ్యులతో కలిసి గడిపే ప్రతి క్షణం ఎంతో ఆనందంగా ఉంటుంది. సిద్ధార్థ్, కిమ్ మీ ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు. మీ వైవాహిక జీవితం ప్రేమానురాగాలతో, సంతోషాలతో నిండిపోవాలని.. జీవితాంతం ఇలాగే కలిసిమెలిసి సాగిపోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను’’ అంటూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోటోల్లో నమ్రతతో పాటు పద్మావతి, మంజుల ఘట్టమనేని తదితరులు సందడి చేశారు. అయితే ఈ ఫోటోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించకపోవడం అభిమానులను కొద్దిగా నిరాశపరిచింది. ప్రస్తుతం మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ (వారణాసి) పనుల్లో అత్యంత బిజీగా ఉన్నారు. ఆ సినిమా వర్క్ షాప్స్, ఇతర కమిట్‌మెంట్స్ వల్లే ఆయన ఈ వేడుకకు హాజరు కాలేకపోయినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే, సిద్ధార్థ్, హైయిన్ కిమ్ లది ప్రేమ వివాహం. విదేశాల్లో చదువుకునే రోజుల్లోనే వీరికి పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారినట్లు సమాచారం. హైయిన్ కిమ్ కు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అయినప్పటికీ ఆమె మీడియాకు, లైమ్ లైట్ కు దూరంగా ఉంటారు. ఇక గల్లా జయదేవ్ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కొడుకు అశోక్ గల్లా ‘హీరో’, ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రాలతో టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ తమ్ముడు సిద్ధార్థ్ మాత్రం సినిమాలకు దూరంగా, వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి కుటుంబ వ్యాపార బాధ్యతలు చూసుకుంటున్నారు. త్వరలో జరగబోయే వీరి వివాహం ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగనుందని జోరుగా ప్రచారం సాగుతోంది.మరింత చదవండి

Source link