ఈ సినిమా కథ విషయానికొస్తే.. కంటి చూపు మందగించే వ్యాధితో బాధపడుతున్న డీఎస్పీ ప్రేమ్ రాజ్ (సూర్య) తన పోలీసు ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో నగరంలో జరిగే వరుస దారుణ హత్యలు పోలీసులకు సవాల్‌గా మారుతాయి. దీంతో డిపార్ట్‌మెంట్ రిక్వెస్ట్ మేరకు ప్రేమ్ రాజ్ మళ్లీ విధుల్లోకి దిగుతాడు. కంటి చూపు పూర్తిగా మందగించినప్పటికీ, తన అపారమైన అనుభవం, జ్ఞాపకశక్తితో పాటు, తన కళ్లుగా నిలిచే మాయ (నజ్రియా) సహాయంతో ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. ఈ వరుస హత్యల వెనుక ఉన్న విచిత్రమైన, అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్ ఈశ్వరన్ (నస్లెన్). ప్రేమ్ రాజ్ కు – ఈశ్వరన్ కు మధ్య జరిగే మైండ్ గేమ్‌లో ఎవరు గెలిచారు? ఈశ్వరన్ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అనేది వెండితెరపై చూడాల్సిందే.

