ఈ మార్గదర్శకాల ప్రకారం పెళ్లయిన మహిళల దగ్గర 500 గ్రాముల వరకు బంగారం, పెళ్లికాని మహిళల దగ్గర 250 గ్రాముల వరకు బంగారం, కుటుంబంలోని పురుషుల దగ్గర 100 గ్రాముల వరకు బంగారం ఉండొచ్చు. ఈ పరిమితుల్లో ఉన్న బంగారు ఆభరణాలను సాధారణంగా ఆదాయపు పన్ను అధికారులు స్వాధీనం చేసుకోరు. అయితే, కుటుంబ ఆర్థిక స్థితి, ఆ ప్రాంతంలోని ఆచారాలు, సంప్రదాయాలు, ఇతర పరిస్థితులను బట్టి అంతకంటే ఎక్కువ బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకోకుండా ఉండే అధికారం సంబంధిత అధికారికి ఉంటుంది. అయితే, సోదాల సమయంలో దొరికిన బంగారు ఆభరణాల వివరాలతో అధికారులు తప్పనిసరిగా పూర్తి జాబితా తయారు చేయాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇవి ఆదాయపు పన్ను సోదాల సమయంలో బంగారాన్ని స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు ఇచ్చిన మార్గదర్శకాలు మాత్రమే. ఒక వ్యక్తి చట్టబద్ధంగా ఎంత బంగారం కలిగి ఉండొచ్చనే దానికి ఇవి పరిమితులు కావు. (ప్రతీకాత్మక చిత్రం)

