Last Updated:
జమ్మూకశ్మీర్లోని కుల్గాంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు మెరుపుదాడికి తెగబడ్డారు. నాకా తనిఖీల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరపడంతో ముగ్గురు గాయపడ్డారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు కొనసాగుతున్నాయి.
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. నాకా తనిఖీల్లో భాగంగా విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. మధ్యాహ్నం సుమారు 2:15 గంటల సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని సాయుధ ఉగ్రవాదులు ఒక్కసారిగా జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ వెంటనే అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. ఈ మెరుపుదాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు క్షతగాత్రులను రక్షించి, దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్ ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) ఆస్పత్రికి తరలించాయి. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. దాడి అనంతరం సైన్యం, పోలీసులు సంయుక్తంగా ఘటనా స్థలాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పారిపోయిన ముష్కరులను పట్టుకునేందుకు కుల్గాం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
#WATCH | J&K | Two CRPF personnel injured after unidentified motorcycle-borne assailants opened fire on security personnel deployed at a naka in Kulgam district this afternoon. The injured personnel were shifted to a hospital in Anantnag district for treatment.
(Visuals from the area, deferred by unspecified time; no live operational details disclosed)— ANI (@ANI) November 11, 2026

