2. హిందాల్కో (Hindalco)నొమురా (Nomura):సిఫార్సు: బై (Buy) | టార్గెట్ ప్రైస్: ₹1,100ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికం (Q3) కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ, క్యూ4లో పుంజుకుంటుందని భావిస్తున్నారు.
అధిక క్యాపెక్స్ ఉన్నప్పటికీ కంపెనీ పరపతి (Leverage) 2x వద్దే స్థిరంగా ఉంటుందని యాజమాన్యం భావిస్తోంది.
ఎల్ఎంఈ ధరల తగ్గుదల, క్యాప్టివ్ బొగ్గు గనుల జాప్యం వంటివి ప్రధాన రిస్కులుగా పేర్కొంది.
యుబిఎస్ (UBS):సిఫార్సు: బై (Buy) | టార్గెట్ ప్రైస్: ₹1,325క్యూ2 ఎబిట్డా వార్షిక ప్రాతిపదికన 43% వృద్ధితో ₹12,800 కోట్లకు చేరి, మార్కెట్ అంచనాలను అధిగమించింది.
అల్యూమినియం విక్రయ ధరలు పెరగడం, నోవెలిస్ (Novelis) కంపెనీ బలమైన పనితీరు (ఎబిట్డా టన్నుకు $553) కనబరచడం లాభాలకు దారితీసింది. కాపర్ విభాగం ఎబిట్డా సైతం అంచనాలను మించి ₹1,670 కోట్లుగా నమోదైంది.
3. టాటా స్టీల్ (Tata Steel): నొమురా (Nomura):సిఫార్సు: బై (Buy) | టార్గెట్ ప్రైస్: ₹240 నుంచి ₹210కి తగ్గింపుయూరోపియన్ వ్యాపారానికి సంబంధించి రాబోయే ఆర్థిక సంవత్సరాల ఎబిట్డా అంచనాలను తగ్గించడంతో టార్గెట్ ధర తగ్గించారు.
భారత కార్యకలాపాల అంచనాల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే 2030 నాటికి ఐరన్ ఓర్ గనుల లీజుల గడువు అంశాన్ని పరిగణనలోకి తీసుకుని మల్టిపుల్‌ను తగ్గించారు.
యుబిఎస్ (UBS):సిఫార్సు: న్యూట్రల్ (Neutral) | టార్గెట్ ప్రైస్: ₹220కన్సాలిడేటెడ్ ఎబిట్డా వార్షికంగా 18% పెరిగి ₹10,500 కోట్లుగా నమోదైంది.
భారత్‌లో ఉత్పత్తి, అమ్మకాలు 8-9% పెరిగాయి. నెదర్లాండ్స్ ప్లాంట్ పునఃప్రారంభం తర్వాత పనితీరు మెరుగుపడగా, యూకే విభాగంలో నష్టాలు ₹720 కోట్లకు పెరిగాయి.
4. డాబర్ ఇండియా (Dabur India) – నొమురాసిఫార్సు: బై (Buy) | టార్గెట్ ప్రైస్: ₹535కంపెనీ రెండంకెల వృద్ధి లక్ష్యాన్ని నిలబెట్టుకుంది. రాబోయే 6-8 నెలల్లో సరికొత్త 3 సంవత్సరాల వ్యూహాన్ని ప్రకటించనుంది.’IGNITE’ ఫ్రేమ్‌వర్క్ ద్వారా ప్రచారానికి బడ్జెట్‌ను 150-200 బేసిస్ పాయింట్లు పెంచనుంది.
లక్షకు పైగా గ్రామాల్లో ప్రత్యక్ష నెట్వర్క్, 40,000 రిటైల్ స్టోర్ల కవరేజీతో గ్రామీణ విపణిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
5. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ (IIFL Finance) – డ్యామ్ క్యాపిటల్సిఫార్సు: బై (Buy) | టార్గెట్ ప్రైస్: ₹880కి పెంపుప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్ బ్లాక్‌స్టోన్ (Blackstone) ద్వారా కంపెనీలోకి నిధుల సమీకరణ విజయవంతంగా పూర్తయింది.
ఈ పెట్టుబడితో కంపెనీ కార్యాచరణ సామర్థ్యం, ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరగనుంది.గోల్డ్ లోన్ వ్యాపారంలో వృద్ధికి మంచి అవకాశాలున్నాయని, రాబోయే రోజుల్లో 20% వరకు సీఏజీఆర్ (CAGR) వృద్ధి నమోదవుతుందని అంచనా.
6. డేటా ప్యాటర్న్స్ (Data Patterns) – గోల్డ్‌మన్ సాక్స్సిఫార్సు: న్యూట్రల్ (Neutral) | టార్గెట్ ప్రైస్: ₹4,16520-25% ఆదాయ వృద్ధి, 35-40% ఎబిట్డా మార్జిన్ గైడెన్స్‌ను యాజమాన్యం కొనసాగించింది.
క్యూ2లో ఆర్డర్ల ప్రవాహం బలంగా ఉంది (₹930 కోట్లు). ప్రస్తుతం ₹1,740 కోట్ల నికర ఆర్డర్ బుక్ అందుబాటులో ఉంది.కంపెనీకి సాధారణంగా నాల్గవ త్రైమాసికంలో డెలివరీలు, ఆదాయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
7. సిజి పవర్ (CG Power) – సిటీసిఫార్సు: బై (Buy) | టార్గెట్ ప్రైస్: ₹1,100మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (MPCB) వాలూజ్ ప్లాంట్‌కు ఇచ్చిన మూసివేత నోటీసుపై బాంబే హైకోర్టు స్టే విధించింది.
ఈ స్టే వల్ల కంపెనీ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం ఉండదు. నాసిక్ ప్లాంట్ సామర్థ్యం కూడా కంపెనీకి అదనపు వెసులుబాటును కల్పిస్తోంది.
8. థర్మాక్స్ (Thermax) – మాక్వారీసిఫార్సు: న్యూట్రల్ (Neutral) | టార్గెట్ ప్రైస్: ₹3,400క్యూ2 ఆదాయం వార్షికంగా 11% పెరిగింది. అయితే ఎబిట్డా అంచనాల కంటే కాస్త తక్కువగా నమోదైంది.
ఆర్డర్ బ్యాక్లాగ్ 16% పెరిగి ₹14,250 కోట్లకు చేరుకుంది. పెద్ద పారిశ్రామిక ఆర్డర్లు మూడో త్రైమాసికానికి మారాయి.
9. బ్రిటానియా (Britannia) – యుబిఎస్సిఫార్సు: బై (Buy) | టార్గెట్ ప్రైస్: ₹5,800కి తగ్గింపుముడిసరుకుల ధరల పెరుగుదల ఆందోళనలతో ఈ షేరు ఈ ఏడాది దాదాపు 20% వరకు దిద్దుబాటుకు లోనైంది.
తొలి అర్ధభాగంలో నమోదైన 11% వాల్యూమ్ గ్రోత్ డిమాండ్ సానుకూలంగా ఉందనే సంకేతాన్ని ఇస్తోంది. ధరల పెంపు కొనసాగితే రాబోయే రోజుల్లో రెండంకెల లాభాల వృద్ధి సాధ్యమని నివేదిక పేర్కొంది.
