Last Updated:
దాదాపు 27 ఏళ్లుగా తమిళ సినిమా గడ్డపై ఇండస్ట్రీ హిట్లు కొడుతూ రారాజుల శాసిస్తున్నాడు సూపర్ స్టార్. అసలు రజనీకి తమిళనాట ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎంతలా అంటే.. 27 ఏళ్లుగా రజనీ ఒక్కడే ఇండస్ట్రీ హిట్లు కొడుతూ వస్తున్నాడు.
దాదాపు 27 ఏళ్లుగా తమిళ సినిమా గడ్డపై ఇండస్ట్రీ హిట్లు కొడుతూ రారాజుల శాసిస్తున్నాడు సూపర్ స్టార్. అసలు రజనీకి తమిళనాట ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎంతలా అంటే.. 27 ఏళ్లుగా రజనీ ఒక్కడే ఇండస్ట్రీ హిట్లు కొడుతూ వస్తున్నాడు. నరసింహం సినిమా నుంచి చంద్రముఖి, శివాజీ, రోబో, కబాలి, రోబో 2.O.. ఇప్పుడు జైలర్ 2తో వరుసగా 7 సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు. ఈ రికార్డు ఇప్పటి వరకు ఏ హీరో కూడా సాధ్యం కాలేదు. మధ్యలో దళపతి విజయ్, సూపర్ స్టార్‌ను మించి పోతున్నాడు అనుకున్నారు కానీ.. మళ్లీ సూపర్ స్టార్ లైన్‌లోకి వచ్చాడు.
రీసెంట్‌గా ఆయన నటించిన ‘జైలర్-2’ సినిమా రూ.800 కోట్ల క్లబ్‌లోకి చేరి ఆ రికార్డు సాధించిన తొలి తమిళ సినిమాగా సంచలనం సృష్టించింది. నిజానికి ఈ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో కూడా రివ్యూలు రాలేదు. కానీ.. కేవలం రజనీ స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆడియెన్స్‌ను వెర్రెత్తిపోయేలా చేశాడు. ఒక్క తమిళనాటే కాదు… రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా యుఫోరియా మాములుగా లేదు.
మూడేళ్ల కిందట తమిళ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిన జైలర్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌కు మించి బీభత్సం సృష్టిస్తుంది. అసలు సినిమా రిలీజై మూడు వారాలు దగ్గరికి వస్తున్నా సరే.. సూపర్ స్టార్ మ్యానియా ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక్క తమిళనాటే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా చూపిస్తున్న ర్యాంపేజ్ అంతా ఇంతా కాదు.
రజనీ స్క్రీన్ ప్రజెన్స్, అనిరుధ్ మ్యూజిక్, నెల్సన్ కుమార్ మేకింగ్‌కు జనాలు పిచ్చోళ్లైపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ.42 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. కాగా.. ఇప్పటి వరకు తెలుగులో ఈ సినిమాకు రూ.61 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఈ సినిమాకు ఆల్రెడీ రూ.19 కోట్ల లాభాలు వచ్చాయి.
ఇక వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే రూ.304 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రంగంలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.398 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అంటే వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే.. ఈ సినిమాకు రూ. 94 కోట్ల వరకు లాభాలు వచ్చాయి. గ్రాస్ లెక్కలో చెప్పాలంటే రూ.824 కోట్ల దాటేశాయి. అంతేకాదు రూ.800 కోట్ల క్లబ్‌లో చేరిన ఫస్ట్ తమిళ సినిమాగా జైలర్2 మూవీ రికార్డులు తిరగరాసింది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. టైగర్ ముత్తువేల్ పాండ్యన్ తన కొడుకు హత్యకు సంబంధించిన నిజాన్ని కుటుంబానికి తెలియకుండా దాచిపెడతాడు. ఎవరికీ గుర్తుపట్టలేని ఓ ఊరికి వెళ్లి, అక్కడ సాధారణ జీవితం గడుపుతూ ఫ్యామిలీని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాడు. మరోవైపు వర్మను చంపిన వ్యక్తి కోసం దిలీప్ వెతుకుతుంటాడు. మిస్ అయిన మూడు కంటైనర్ల వ్యవహారం కూడా అతడికి తలనొప్పిగా మారుతుంది. ఈ క్రమంలో ముత్తు ఓ చిన్న గొడవ కారణంగా మూర్తి దగ్గర డ్రైవర్‌గా చేరతాడు. అక్కడి నుంచి విగ్రహాల స్మగ్లింగ్ వ్యవహారంలోకి అడుగుపెడతాడు. మరి ఈ ఆటలో ముత్తు పైచేయి సాధిస్తాడా? దిలీప్ అతడిని కనిపెడతాడా? తన కుటుంబాన్ని ముత్తు ఎలా కాపాడుకుంటాడు? అనేది సినిమా కథ.

