ప్రభన్యూస్

Train Accident: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఢీకొన్న రెండు రైళ్లు.. ఏడుగురు మృతి.. 125 మందికి గాయాలు |


Last Updated:

Train Accident: ఈజిప్టు రాజధాని కైరో నగరానికి దక్షిణాన ఆదివారం పెను రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

రైలు ప్రమాదం దృశ్యం
రైలు ప్రమాదం దృశ్యం

రెండు రైళ్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్న ఘటనలో కనీసం ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 125 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ అధికార యంత్రాంగం వెల్లడించింది. మరణించిన వారిలో ఒక రైలు కండక్టర్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన వారిలో 70 మందికి పైగా ప్రయాణికులు చికిత్స అనంతరం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.

రైలు వెనుక భాగాన్ని ఢీకొట్టిన మరో రైలు

ఈజిప్టు రవాణా మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. కైరోకు దక్షిణాన దాదాపు 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిజా ప్రావిన్స్‌లోని అల్-అయాత్ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నైరుతి ప్రావిన్స్ ఫయూమ్‌ వైపు వెళ్తున్న ఓ ప్యాసింజర్ రైలు, అదే దిశలో దక్షిణ ఈజిప్టులోని అస్వాన్ వైపు వెళ్తున్న మరో రైలు వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. కైరో-అస్వాన్ రైలు ఒకే ట్రాక్‌పై ఆగి ఉండగా, వెనుక నుంచి వచ్చిన గిజా-ఫయూమ్ రైలు దాని చివరి బోగీని నేరుగా ఢీకొట్టిందని చీఫ్ ప్రాసిక్యూటర్ కార్యాలయం పేర్కొంది. ఆదివారం రాత్రి సహాయక దర్యాప్తు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద కారణాలపై విచారణ చేపట్టాయి.

సహాయక చర్యల్లో ముందుకొచ్చిన గ్రామస్తులు

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని బోగీల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను కాపాడారు. శిథిలాల నుంచి ప్రాణాలతో ఉన్నవారిని బయటకు తీసి, అత్యవసర సేవల విభాగానికి సమాచారం అందించారు. దాదాపు 80 మంది క్షతగాత్రులను అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారని స్థానికుడు అయ్మన్ గమల్ తెలిపాడు. ఆగివున్న రైలు బోగీలో చిక్కుకున్న కొందరు ప్రయాణికులు అప్పటికే ప్రాణాలు కోల్పోయి విగతజీవులుగా కనిపించారని ప్రత్యక్ష సాక్షులు వాపోయారు.

పక్కనే ఉన్న బెని సూఫ్ ప్రావిన్స్‌లోని అల్-వస్తా సెంట్రల్ ఆసుపత్రికి తరలించిన బాధితులు ప్రమాద సమయంలో భయానక వాతావరణం నెలకొందని తెలిపారు. ప్రమాద తీవ్రతకు భారీగా ధూళి, పొగ లేవడంతో ఊపిరాడక అల్లాడిపోయామని, గ్రామస్తులు వచ్చి కాపాడారని వారు పేర్కొన్నారు. ఫయూమ్ రైలులో ప్రయాణిస్తున్న ఫర్హా గమల్ మాట్లాడుతూ.. పలు బోగీలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయని, కొందరు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు బయటకు రావడానికి తీవ్రంగా పోరాడారని చెప్పింది.

విచారణకు ఈజిప్టు అధ్యక్షుడు ఆదేశం

ఈ ఘోర ప్రమాదంపై సమగ్ర, వేగవంతమైన విచారణ జరపాలని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్-ఫత్తా ఎల్-సిసి ఆదేశాలు జారీ చేశారు. రైలు మార్గంలో పడివున్న బోగీల శిథిలాలను తొలగించి, రైలు రాకపోకలను పునరుద్ధరించేందుకు క్రేన్లు, అత్యవసర బృందాలను రంగంలోకి దించినట్లు ఈజిప్షియన్ రైల్వే అథారిటీ ప్రకటించింది.

ఈజిప్టులో నిర్వహణ లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా రైలు ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గత సెప్టెంబర్‌లో కూడా ఇదే అల్-అయాత్ జిల్లాలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటనలో లోకోపైలట్, ఆయన సహాయకుడు గాయపడ్డారు. కాగా, ఈజిప్టు చరిత్రలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం 2002లో సంభవించగా, రాత్రిపూట ప్రయాణిస్తున్న రైలులో మంటలు చెలరేగి 300 మందికి పైగా సజీవదహనమయ్యారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 November 2026, 8:08 am Digital Edition : Prabhanews
Train Accident: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఢీకొన్న రెండు రైళ్లు.. ఏడుగురు మృతి.. 125 మందికి గాయాలు |

Last Updated:Nov 09, 2026 7:59 AM ISTTrain Accident: ఈజిప్టు రాజధాని కైరో నగరానికి దక్షిణాన ఆదివారం పెను రైలు ప్రమాదం చోటుచేసుకుంది.రైలు ప్రమాదం దృశ్యంరెండు రైళ్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్న ఘటనలో కనీసం ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 125 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ అధికార యంత్రాంగం వెల్లడించింది. మరణించిన వారిలో ఒక రైలు కండక్టర్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన వారిలో 70 మందికి పైగా ప్రయాణికులు చికిత్స అనంతరం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.రైలు వెనుక భాగాన్ని ఢీకొట్టిన మరో రైలుఈజిప్టు రవాణా మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. కైరోకు దక్షిణాన దాదాపు 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిజా ప్రావిన్స్‌లోని అల్-అయాత్ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నైరుతి ప్రావిన్స్ ఫయూమ్‌ వైపు వెళ్తున్న ఓ ప్యాసింజర్ రైలు, అదే దిశలో దక్షిణ ఈజిప్టులోని అస్వాన్ వైపు వెళ్తున్న మరో రైలు వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. కైరో-అస్వాన్ రైలు ఒకే ట్రాక్‌పై ఆగి ఉండగా, వెనుక నుంచి వచ్చిన గిజా-ఫయూమ్ రైలు దాని చివరి బోగీని నేరుగా ఢీకొట్టిందని చీఫ్ ప్రాసిక్యూటర్ కార్యాలయం పేర్కొంది. ఆదివారం రాత్రి సహాయక దర్యాప్తు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద కారణాలపై విచారణ చేపట్టాయి.సహాయక చర్యల్లో ముందుకొచ్చిన గ్రామస్తులుప్రమాదం జరిగిన వెంటనే స్థానిక గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని బోగీల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను కాపాడారు. శిథిలాల నుంచి ప్రాణాలతో ఉన్నవారిని బయటకు తీసి, అత్యవసర సేవల విభాగానికి సమాచారం అందించారు. దాదాపు 80 మంది క్షతగాత్రులను అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారని స్థానికుడు అయ్మన్ గమల్ తెలిపాడు. ఆగివున్న రైలు బోగీలో చిక్కుకున్న కొందరు ప్రయాణికులు అప్పటికే ప్రాణాలు కోల్పోయి విగతజీవులుగా కనిపించారని ప్రత్యక్ష సాక్షులు వాపోయారు.పక్కనే ఉన్న బెని సూఫ్ ప్రావిన్స్‌లోని అల్-వస్తా సెంట్రల్ ఆసుపత్రికి తరలించిన బాధితులు ప్రమాద సమయంలో భయానక వాతావరణం నెలకొందని తెలిపారు. ప్రమాద తీవ్రతకు భారీగా ధూళి, పొగ లేవడంతో ఊపిరాడక అల్లాడిపోయామని, గ్రామస్తులు వచ్చి కాపాడారని వారు పేర్కొన్నారు. ఫయూమ్ రైలులో ప్రయాణిస్తున్న ఫర్హా గమల్ మాట్లాడుతూ.. పలు బోగీలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయని, కొందరు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు బయటకు రావడానికి తీవ్రంగా పోరాడారని చెప్పింది.విచారణకు ఈజిప్టు అధ్యక్షుడు ఆదేశంఈ ఘోర ప్రమాదంపై సమగ్ర, వేగవంతమైన విచారణ జరపాలని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్-ఫత్తా ఎల్-సిసి ఆదేశాలు జారీ చేశారు. రైలు మార్గంలో పడివున్న బోగీల శిథిలాలను తొలగించి, రైలు రాకపోకలను పునరుద్ధరించేందుకు క్రేన్లు, అత్యవసర బృందాలను రంగంలోకి దించినట్లు ఈజిప్షియన్ రైల్వే అథారిటీ ప్రకటించింది.ఈజిప్టులో నిర్వహణ లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా రైలు ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గత సెప్టెంబర్‌లో కూడా ఇదే అల్-అయాత్ జిల్లాలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటనలో లోకోపైలట్, ఆయన సహాయకుడు గాయపడ్డారు. కాగా, ఈజిప్టు చరిత్రలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం 2002లో సంభవించగా, రాత్రిపూట ప్రయాణిస్తున్న రైలులో మంటలు చెలరేగి 300 మందికి పైగా సజీవదహనమయ్యారు.మరింత చదవండి

Source link