వచ్చే వారం అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, భారత్ దేశాల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. అమెరికా ఉద్యోగాల వివరాలు, ఫెడరల్ రిజర్వ్ అధికారుల ప్రసంగాలను కూడా పెట్టుబడిదారులు గమనించనున్నారు. ఈ వివరాలు వడ్డీ రేట్లపై అంచనాలను మార్చవచ్చు. వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు పెరిగితే బంగారానికి మద్దతు లభించవచ్చు. డాలర్ బలపడితే మాత్రం పసిడి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.

